News October 22, 2024
HYD: గుడ్ న్యూస్ చెప్పిన జలమండలి
HYD నగర ప్రజలకు జలమండలి గుడ్ న్యూస్ తెలిపింది. నగరంలో పనికిరాని చేతిపంపుల వద్ద ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. 90 రోజుల స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వరద నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో జలమండలి, చేతి పంపులను ఇంజక్షన్ బోర్లుగా మార్చనుంది.
Similar News
News January 21, 2025
HYD: జామై ఉస్మానియా ట్రాక్‌పై అమ్మాయి మృతదేహం
సికింద్రాబాద్ జామై ఉస్మానియా రైల్వే ట్రాక్ మీద అమ్మాయి మృతదేహం కలకలం రేపింది. స్థానికుడు రాజు తెలిపిన వివరాలు.. ‘ఉదయం వాకింగ్‌కు వెళ్లగా రైల్వే ట్రాక్ మీద జనాలు గుమిగూడారు. ఏంటని వెళ్లి చూడగా ఓ అమ్మాయి తల, మొండెం వేరుగా పడి ఉంది. పోలీసులు వచ్చి దర్యాప్తు చేపట్టారు. సదరు యువతి ఓయూలో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు తెలిసింది.’ అని రాజు పేర్కొన్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది
News January 21, 2025
పెరిగిన చలి: హైదరాబాద్‌లో సింగిల్ డిజిట్
HYDలో చలి మరింత పెరిగింది. మంగళవారం HCU వద్ద అత్యల్పంగా 8.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మౌలాలి-9.3, BHEL-9.4, రాజేంద్రనగర్‌లో 9.7 సింగిల్ డిజిట్ నమోదు కావడం గమనార్హం. మరో 5 రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. KBR పార్క్, ఇందిరా పార్క్, ఓయూ తదితర ప్రాంతాల్లో ఉదయం చలిగాలులు వీచాయి. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్త వహించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
News January 21, 2025
ECILలో జాబ్స్.. నెలకు రూ. 2,80,000
కాంట్రాక్ట్ బేసిక్ కింద ఖాళీగా ఉన్న జనరల్ మేనేజర్ 4, సీనియర్ మేనేజర్ 6 పోస్టులను ECIL భర్తీ చేస్తోంది. MBA, PG, PG డిప్లొమా ఉత్తీర్ణులై.. అనుభవం ఉన్నవారు అర్హులు. ఫైనాన్స్, HR, డిఫెన్స్ సిస్టమ్ తదితర విభాగాల్లో GM పోస్టులకు నెలకు రూ. 1.20 లక్షల నుంచి 2.80 లక్షల Pay Scale ఉంటుంది. సీనియర్ మేనేజర్‌కు Pay Scale రూ. 70 వేల నుంచి రూ. 2 లక్షలు చెల్లిస్తారు. అప్లై చేసేందుకు జనవరి 31 చివరి తేదీ.
SHARE IT