News March 19, 2025

HYD గురించి చెప్పాలనుకుంటున్నారా?

image

స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే మొదలైంది. దేశంలోని వివిధ నగరాలకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ అవార్డులు అందజేస్తోంది. ఈ సర్వేలో ప్రజలు పాల్గొని తమ నగరం గురించి అభిప్రాయాలు చెప్పవచ్చు. https ://sbmurban.org/feedback వెబ్‌సైట్ ద్వారా సర్వేలో పాల్గొనవచ్చు. సర్వేలో పాల్గొనేందుకు ఈనెల 31 వరకు మాత్రమే అవకాశం. ఇప్పటికే దాదాపు 14వేల మంది నగరవాసులు సర్వేలో పాల్గొన్నారు. మరి ఇంకెందుకాలస్యం.. మీరు కూడా పాల్గొనండి.

Similar News

News November 25, 2025

WGL: లిక్కర్ షాపులకు మరో రెండు రోజులే..!

image

ఉమ్మడి జిల్లాలో 294 లిక్కర్ షాపుల లైసెన్స్ గడువు మరో రెండు రోజులే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27 నుంచి పాత మద్యం షాపులకు సరఫరా నిలిపివేసి, 28 నుంచి కొత్త మద్యం షాపులకు లిక్కర్ ఇచ్చేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. డిపోల కేటాయింపు, షాపులకు పేర్లపై డిపో కోడ్‌లను జనరేట్ చేసి QR కోడ్‌లు సిద్ధమవుతున్నాయి. DEC 1 నుంచి కొత్త షాపుల్లో మద్యం అమ్మకాలు జరగనున్నాయి. కొత్త షాపులకు సర్పంచ్ ఎన్నికలు కలిసి రానున్నాయి.

News November 25, 2025

జనగామ: ముక్కిపోతున్న దొడ్డు బియ్యం!

image

జిల్లాలోని ఆయా రేషన్ డీలర్ల షాపులలో పాత స్టాక్ (దొడ్డు బియ్యం) ముక్కిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడంతో మిగిలిపోయిన పాత స్టాక్ మొత్తం పురుగులు పట్టి పాడవుతున్నాయని, ఇప్పటికే 70% మేర బియ్యం పాడైపోయాయని ఆయా షాపుల రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టించుకోని బియ్యాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.

News November 25, 2025

కోటంరెడ్డి సోదరుడి కుమార్తె సంగీత్‌లో భారత క్రికెటర్

image

టీడీపీ నేత, నుడా ఛైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తె హరిణ్యా రెడ్డికి గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌తో మరో రెండు రోజుల్లో వివాహం జరగనుంది. తాజాగా జరిగిన సంగీత్ వేడుకకు రాహుల్ సిప్లిగంజ్ టీం ఇండియా స్పిన్నర్ చాహల్‌‌ను ఆహ్వానించారు. దీంతో ‘‘నేను చాహల్‌కి వీరాభిమానిని. ఆయన మన సంగీత్‌కు వచ్చారంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నా’’ అంటూ హరిణ్య పోస్టు చేశారు.