News February 1, 2025
HYD: గురుకులల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై TG ప్రభుత్వం కీలక నిర్ణయం

రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఈ మేరకు హాస్టళ్లు, గురుకులాల్లో ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాలను పాటించేందుకు ఎన్ఐఎన్ సహకారం తీసుకోనుంది. ఆహార నాణ్యతతో ప్రమాణాలతో పాటు సిబ్బంది పాటించాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసిజర్ రూపొందించేందుకు ప్రభుత్వం NIN సహకారం కోరింది.
Similar News
News February 19, 2025
HYD: KCR వస్తున్నారు.. ‘కారు’లన్నీ అటువైపే!

నగరంలోని తెలంగాణభవన్‌లో బుధవారం సందడి వాతావరణం నెలకొననుంది. మధ్నాహ్నం రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం KCR అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. నగరంతో పాటు అన్ని జిల్లాల ముఖ్యనేతలు ఈ కార్యక్రమానికి తరలివెళ్తున్నారు. కారులన్నీ తెలంగాణ భవన్‌కు క్యూ కట్టాయి. భవిష్యత్తు కార్యాచరణపై HYD వేదికగా కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మీటింగ్ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.
News February 19, 2025
శివాజీ జయంతి: హోరెత్తనున్న హైదరాబాద్

మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ జయంతి నేడు. ఈ సందర్భంగా ఉత్సవాలకు హైదరాబాద్ ముస్తాబైంది. హిమాయత్‌నగర్, గోషామహల్, రాంనగర్, అంబర్‌పేట, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నంలో హిందూ ఏక్తా ర్యాలీలు నిర్వహించనున్నారు. శివాజీ మహారాజ్ భారీ విగ్రహాలను సిటీలో ఊరేగిస్తారు. జై భవాని.. జై శివాజీ నినాదాలతో నేడు భాగ్యనగరం హోరెత్తనుంది.
News February 19, 2025
HYD: మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ మేళా కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. భక్తుల సౌకర్యార్థం ఈ రైళ్లను ప్రవేశపెట్టింది. సికింద్రాబాద్ నుంచి దానాపూర్, రక్సౌల్‌కు ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఈ రైళ్లు ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు అందుబాటులో ఉంటాయి. రైళ్ల రాకపోకల వివరాలు.. తేదీల కోసం పైన పేర్కొన్న పట్టికను చూడండి. ఈ రైళ్ల రాకపోకల సమాచారం కోసం SCR వెబ్‌సైట్ చూడొచ్చు.