News February 9, 2025
HYD: గురుమూర్తిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

మీర్ పేట్‌లో భార్యను అతికిరాతకంగా హత్య చేసిన కేసులో నిందితుడు గురుమూర్తిని పోలీసులు శనివారం కస్టడీలోకి తీసుకున్నారు. ఈ మేరకు మీర్ పేట పోలీసులు కష్టపడి పిటిషన్ వేసి విచారణ నిమిత్తం గురుమూర్తిని శనివారం 4రోజులు కస్టడీలోకి తీసుకోగా సరూర్ నగర్ సీసీఎల్ లేదా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్‌కు విచారణ నిమిత్తం తరలించినట్లు తెలుస్తోంది.
Similar News
News March 26, 2025
సికింద్రాబాద్‌లో యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

సికింద్రాబాద్ మహంకాళి PS పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం.. వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్పాట్‌లోనే ఒకరు మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. స్పాట్ వద్ద సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
News March 26, 2025
మాన్‌సూన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి: ఇలంబర్తి

వర్షాకాలంలో నగర వాసుల కష్టాలను తొలగించే విధంగా మాన్‌సూన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇటంబర్తి సంబంధిత అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఫైర్ సేఫ్టీ, మాన్‌సూన్ యాక్షన్‌ప్లాన్, నాలా పూడికతీత, నాలా భద్రతా చెరువుల పునరుద్ధరణ అంశాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి కమిషనర్ సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో ఎదురయ్యే పలు సమస్యలపై చర్చించారు.
News March 26, 2025
జిల్లాలో కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతలు

రంగారెడ్డి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. మంగళవారం మామిడిపల్లె, తొమ్మిదిరేకుల 38.8 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు కాసులాబాద్ 38.7℃, రెడ్డిపల్లె 38.6, మంగళ్‌పల్లె 38.4, మొగలిగిద్ద 38.3, కేతిరెడ్డిపల్లె, మొయినాబాద్, షాబాద్ 38.1, తుర్కయంజాల్, తొర్రూర్ 38, దండుమైలారం 37.7, హస్తినాపురం, నాగోల్ 37.5, గచ్చిబౌలి, మాదాపూర్, రాజేంద్రనగర్ 37.4, ఇబ్రహీంపట్నంలో 37℃ఉష్ణోగ్రత నమోదైంది.