News June 11, 2024

HYD: గృహజ్యోతి పథకం పునః ప్రారంభం..!

image

ఎన్నికల కోడ్ ముగియడంతో గృహజ్యోతి పథకం పునః ప్రారంభించామని అధికారులు తెలిపారు. RR, VKB పరిధిలో దీనిని ప్రారంభించగా 3.73 లక్షల మందికి పైగా ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు. ఇక HYD, మేడ్చల్ పరిధిలో ఇప్పటికే కొనసాగుతోందన్నారు. అర్హత ఉండి గతంలో దరఖాస్తు చేసుకోలేని వారు.. చేసుకున్నా సాంకేతిక కారణాలతో సున్నా బిల్లులు రానివారు GHMC ప్రజాపాలన కేంద్రాల్లో అప్లై చేయాలని అధికారి ఆనంద్ తెలిపారు. SHARE IT

Similar News

News July 11, 2025

GHMCకి మీడియాకు వారానికోసారి ఎంట్రీ?

image

జర్నలిస్టులు ఇక ఎప్పుడు పడితే అప్పుడు GHMC ప్రధాన కార్యాలయంలోకి వెళ్లడానికి వీలుపడకపోవచ్చు. రెగ్యులర్ జర్నలిస్టులతో పాటు యూట్యూబ్ ఛానళ్ల వారు నిత్యం అధికారులను కలిసేందుకు వస్తున్నారని, దీంతో విధినిర్వహణకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. అందుకే అక్రిడిటేషన్ ఉన్న వారిని మాత్రమే వారానికి ఒకసారి అనుమతించాలని నిర్ణయించినట్లు సమాచారం.

News July 11, 2025

HYD: మాయం కానున్న ఆ మూడు పార్టీలు!

image

తెలంగాణలో మూడు పార్టీలు మాయం కానున్నాయి. అన్ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ పార్టీలైన ఏపీ రాష్ట్ర సమైక్య సమితి పార్టీ, జాతీయ మహిళా పార్టీ, యువ తెలంగాణ పార్టీలు రాష్ట్రంలో 2019 నుంచి లోక్‌సభ, అసెంబ్లీ, ఉపఎన్నికల్లో పోటీచేయలేదు. దీంతో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఆయా పార్టీలకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తొలగింపు ప్రతిపాదనకు నోటీసులు పంపించారు.

News July 11, 2025

HYD: కల్తీ కల్లు తాగి ఎనిమిది మంది మృతి

image

కల్తీ కల్లు <<17017648>>రాజేసిన అగ్గి<<>> ఇంకా చల్లారడంలేదు. ఈ ప్రమాదపు కల్లు తాగి అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ పెద్ద గంగారాం (70) అర్ధరాత్రి 1:30కు గాంధీ హాస్పిటల్‌లో మృతి చెందాడు. కూకట్‌పల్లి PS పరిధిలోని ఆదర్శనగర్‌లో ఆయన నివాసం ఉండేవారు. ఈయన మరణంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. 30 మందికి పైగా వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొంతుతున్నారు.