News April 12, 2024

HYD: గృహజ్యోతి రాకుంటే కాల్ చేయండి!

image

గత నెలలో గృహ జ్యోతి పథకం అమలై, ఏప్రిల్ నెలలో అమలు కాని సమయంలో తమను సంప్రదించాలని ఘట్కేసర్ పరిధిలోని వివిధ ప్రాంతాల అధికారులు తెలిపారు. ఘట్కేసర్ AE-9440813178, నారపల్లి AE-9440813176, పీర్జాదిగూడ-8333924856, మేడిపల్లి-89855 68654లకు కాల్ చేయాలని సూచించారు. మిగతా ఎలక్ట్రిసిటీ సంబంధిత సమస్యలకు 1912ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

Similar News

News February 23, 2026

HYD: పేదల ఇళ్ల కూల్చివేతలపై UDF ధ్వజం..!

image

మూసీ ప్రక్షాళన ముసుగులో పేదల ఇళ్లను కూల్చడం అన్యాయమని అర్బన్ డెవలప్‌మెంట్ ఫోరం మండిపడింది. దశాబ్దాలుగా ఉంటోన్న వారిని బఫర్ జోన్ పేరుతో రోడ్డున పడేయడం ఏంటని ప్రశ్నించింది. DPR సిద్ధం కాకుండానే తొలగింపులు చేపట్టడం బాధ్యతారాహిత్యమని కన్వీనర్ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. రియల్ ఎస్టేట్, టూరిజం బిజినెస్ కోసం సామాన్యుల గూళ్లు కూల్చొద్దని, నదిని మాత్రమే శుద్ధి చేయాలని కోరారు. తక్షణమే కూల్చివేతలను ఆపాలన్నారు.

News February 23, 2026

HYD: ఇకపై అలాంటివారిని పట్టిస్తే రూ.200/-

image

మీ వీధిలో ఎవరైనా మోటారు పెట్టి సంపులు పొంగిస్తున్నారా? పైపు లీకేజీని పట్టించుకోకుండా వదిలేస్తున్నారా? అయితే వెంటనే అలర్ట్ అవ్వండి. మార్చి మొదటి వారం నుంచి HMWSSB అందుబాటులోకి తెస్తున్న ‘పానీ యాప్’ ద్వారా నీటి వృథాను ఫొటో తీసి అప్‌లోడ్ చేయండి. అధికారులు IP అడ్రస్ ద్వారా నిందితులను గుర్తించి వెంటనే జరిమానా విధిస్తారు. ఇలా నీటిని ఆదా చేసినందుకు మీకు రూ.200ల నగదు ప్రోత్సాహకం కూడా లభిస్తుంది.

News February 23, 2026

HYD: MCHRD.. CM క్యాంప్ ఆఫీస్ కాబోతుందా..?

image

HYDలోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(MCRHRD)లో VVIP గెస్ట్ హౌస్ రూపురేఖలు మారబోతున్నాయి. అతిథుల భద్రతే లక్ష్యంగా దాదాపు రూ.9 కోట్లతో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంపౌండ్ వాల్‌కు కాన్సర్టినా వైర్ ఫెన్సింగ్, అత్యాధునిక వాచ్ టవర్లు, పటిష్ఠమైన గేట్లతో పాటు పరిసరాల్లో సిమెంట్ రోడ్లు నిర్మించనున్నారు. దీనిని CM క్యాంప్ ఆఫీస్‌గా వాడనున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.