News April 25, 2024
HYD: గృహ జ్యోతి పథకంపై BIG UPDATE

HYD నగరం సహా అనేక చోట్ల 30 రోజుల తర్వాత కరెంటు బిల్లు జనరేట్ చేయడం ద్వారా 200 యూనిట్లకు ఎక్కువగా వచ్చి గృహజ్యోతి పథకాన్ని పొందలేకపోతున్నామని పలువురు వాపోయారు. దీని పై స్పందించిన TSSPDCL అధికారులు, గృహ జ్యోతి పథకానికి కరెంటు బిల్లింగ్ తేదీతో సంబంధం లేదని, నెలసరి సగటు యూనిట్లకే (RED BOX) పథకం లెక్కించబడుతుందని తెలిపింది.కాగా ప్రభుత్వం నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News November 17, 2025
చాంద్రాయణగుట్ట పేరు ఎలా వచ్చిందో తెలుసా?

చాళుక్యుల కాలంలో పాతబస్తీలోని ఎత్తైన కొండపై స్వయంభు లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవస్థానం ఉండేదని ఇక్కడివారు చెబుతారు. ఆ కాలంలో ఈ కొండను చిన్నరాయి గుట్టగా పిలిచేవారట. తర్వాత కాలక్రమంలో చిన్నరాయిగుట్ట అనే పిలుస్తూనే.. చాంద్రాయణగుట్టగా మారిపోయింది. ఈ పవిత్ర గుట్టను ఇంకా కొంతమంది కేశవగిరి అని కూడా పిలుస్తారు.

HYD: 3 ప్రమాదాలు.. 25 రోజులు..83 మంది

ఒక్కరు.. ఇద్దరు కాదు.. 83 మంది దర్మరణం పాలయ్యారు. కేవలం 25 రోజుల వ్యవధిలో బస్సు ప్రమాదాల రూపంలో 83 మంది నగర వాసులు, శివారు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కర్నూలులో అక్టోబర్ 24న 19 మంది, నవంబర్ 4న చేవెళ్లలో 19 మంది, ఈరోజు తెల్లవారుజామున సౌదీలో 45 మంది దుర్మరణం చెందారు. ఈ మూడు ఘోర రోడ్డు ప్రమాదాలన్నీ బస్సు ప్రమాదాలే కావడం గమనార్హం.