News April 25, 2024
HYD: గృహ జ్యోతి పథకంపై BIG UPDATE
HYD నగరం సహా అనేక చోట్ల 30 రోజుల తర్వాత కరెంటు బిల్లు జనరేట్ చేయడం ద్వారా 200 యూనిట్లకు ఎక్కువగా వచ్చి గృహజ్యోతి పథకాన్ని పొందలేకపోతున్నామని పలువురు వాపోయారు. దీని పై స్పందించిన TSSPDCL అధికారులు, గృహ జ్యోతి పథకానికి కరెంటు బిల్లింగ్ తేదీతో సంబంధం లేదని, నెలసరి సగటు యూనిట్లకే (RED BOX) పథకం లెక్కించబడుతుందని తెలిపింది.కాగా ప్రభుత్వం నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News January 25, 2025
HYDలో ఫేక్ ఫాస్ట్ ట్రాక్ వాచ్‌లు అమ్ముతున్న ముఠా అరెస్ట్
HYDలో ఫేక్ ఫాస్ట్ ట్రాక్ వాచ్‌లు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు యువకులు ఫాస్ట్ ట్రాక్ వాచ్‌లు అని చెప్పి ఫేక్ వాచ్‌లను అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. చార్మినార్ పరిసరాల్లో ఈ ముఠా అమ్మకాలు జరపగా పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.కోటి విలువ చేసే 6,037 వాచ్‌లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
News January 25, 2025
ఓయూలో వివిధ డిగ్రీ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్ తదితర కోర్సుల మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
News January 25, 2025
ECILలో భారీ ప్యాకేజీతో ఉద్యోగాలు
కాంట్రాక్ట్ బేసిక్ కింద ఖాళీగా ఉన్న జనరల్ మేనేజర్ 4, సీనియర్ మేనేజర్ 6 పోస్టులను ECIL భర్తీ చేస్తోంది. MBA, PG, డిప్లొమా ఉత్తీర్ణులై.. అనుభవం ఉన్నవారు అర్హులు. ఫైనాన్స్, HR, డిఫెన్స్ సిస్టమ్ తదితర విభాగాల్లో GM పోస్టులకు నెలకు రూ.1.20 లక్షల నుంచి 2.80 లక్షల Pay Scale ఉంటుంది. సీనియర్ మేనేజర్‌కు Pay Scale రూ.70 వేల నుంచి రూ. 2 లక్షలు చెల్లిస్తారు. అప్లై చేసేందుకు JAN 31 చివరి తేదీ.
SHARE IT