News March 23, 2024
HYD: గెలిచి.. KCRకు గిఫ్ట్ ఇద్దాం: MLA

మల్కాజిగిరిలో BRS గెలుపు ఖాయమని ఉప్పల్ MLA బండారు లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం BRS ఆత్మీయ సమ్మేళనంలో ఆ పార్టీ మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేసి.. మల్కాజిగిరిని KCRకు గిఫ్ట్‌గా ఇద్దామని అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించేలా లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.
Similar News
News December 1, 2025
HYD: గ్లోబల్ సమ్మిట్ విజన్ డాక్యుమెంట్.. ఇదీ సీఎం ప్లాన్

ఈ నెల 8,9 తేదీలల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించి విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రేపు సాయంత్రానికి ఆయా శాఖలకు సంబంధించి అధికారులు పూర్తి నివేదికను సమర్పించాలి. 3,4 తేదీలల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి క్షుణ్ణంగా పరిశీలించి 6 తేదీకి విజన్ డాక్యుమెంట్ రూపొందించాలన్నారు.
News December 1, 2025
హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 9,744 మందికిపైగా ఎయిడ్స్.!

ఎయిడ్స్ వచ్చిన సరే సాధారణ జీవితం గడపవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గత 5ఏళ్లలో హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 9,744 మందికిపైగా ఎయిడ్స్ వ్యాధి బారిన పడినవారు ఉన్నారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సమాజం ఈ లెక్కలు చెబుతోంది. వీటితోపాటు నివారణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యాంటీరెట్రోవైరల్ థెరపీ ద్వారా ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. కాగా, నేడు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం.
News December 1, 2025
HYD: రాజ్ భవన్.. లోక్ భవన్‌గా మారనుందా?

సోమాజిగూడలోని గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్ ఇకనుంచి లోక్‌భవన్‌గా మారే అవకాశం ఉంది. గవర్నర్లు నివాసం ఉంటున్న రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్‌గా కేంద్రం మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ఆదేశాలు ఇవ్వకపోయినా.. కేంద్రం సూచనల మేరకు ఇప్పటికే తమిళనాడు, పశ్చిమబెంగాల్లోని రాజ్భవన్లు లోక్‌భవన్‌గా మారాయి. ఈ క్రమంలో మన రాజ్‌భవన్ కూడా పేరు మారుతుందా అనే చర్చ సాగుతోంది.


