News October 23, 2024
HYD: గోడ కూల్చివేత.. GHMC క్లారిటీ
లిబర్టీలోని అంబేడ్కర్ విగ్రహం చుట్టూ అడ్డు గోడ కట్టారని పలువురు కూల్చివేశారు. ఈ వివాదంపై జీహెచ్ఎంసీ వివరణ ఇచ్చింది. నగరంలోని వివిధ జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా పార్లమెంట్ నమూనాను అంబేడ్కర్ విగ్రహం చుట్టూ నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు.
Similar News
News November 9, 2024
HYD: పొగ మంచు.. ఇదీ పరిస్థితి!
HYD నగర శివారు, RR, MDCL, VKB జిల్లాలోని పలుచోట్ల 17 డిగ్రీల ఉష్ణోగ్రత సైతం నమోదవుతోంది. చలితో పాటు, పొగ మంచు ఉంటుంది. పొగ మంచు కారణంగా ప్రతి సంవత్సరం భారతదేశంలో దాదాపు 40 వేల ప్రమాదాల్లో 600 మంది మృత్యువాత పడుతున్నారు. 16,000 మంది గాయాల పాలవుతున్నారు. HYD నగరంలో ఏటా సగటున 380 నుంచి 400 ప్రమాదాలు చోటు చేసుకుంటుండగా.. 50 మంది చనిపోతున్నారు. అధిక పొగ మంచులో అధికారులు డ్రైవింగ్ వద్దంటున్నారు.
News November 8, 2024
HYD: MLA మనవరాలి టాలెంట్ చూసి KTR ఫిదా..!
7వ తరగతి చదువుతున్న పట్లోళ్ల అక్షయిని రెడ్డి టాలెంట్ చూసి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఫిదా అయ్యారు. చిన్న వయసులోనే ‘ట్రయల్ ఆఫ్ మిస్ ఫార్చున్’ అనే పుస్తకాన్ని రాసిన అక్షయిని రెడ్డి తన టాలెంట్ ఏంటో నిరూపించారు. అక్షయిని రెడ్డి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మనవరాలు. ఆటమ్ అనే అమ్మాయి కథే ‘ట్రయల్ ఆఫ్ మిస్ ఫార్చున్’ పుస్తకం అని వారు తెలిపారు.
News November 8, 2024
HYD: ప్రభుత్వ పాఠశాలలపై పర్యవేక్షణ ఎక్కడ?
HYD, RR, మేడ్చల్ జిల్లాల్లో 3,70,357 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు. అయితే పాఠశాలలపై అనునిత్యం జరగాల్సిన తనిఖీలు జరగడం లేదు. అధికారులకు నెలనెలా తనిఖీలు చేసి పరిస్థితి ఎలా ఉంది..? విద్యార్థులకు అన్ని వసతులు ఉన్నాయా..? పాఠశాలకు, పిల్లలకు ఏం అవసరం..? అనే వివరాలు రికార్డు చేయాల్సి ఉంది. కానీ.. అది జరగడం లేదంటున్నారు. దీంతో పలుచోట్ల పిల్లలే రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తున్నారు.