News May 21, 2024

HYD: గోల్డెన్ జూబ్లీ భవనం.. ప్రారంభానికి మరింత సమయం

image

JNTUలో నూతనంగా నిర్మించిన గోల్డెన్ జూబ్లీ భవనం ప్రారంభానికి మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మంగళవారంతో ప్రస్తుత VC కట్టా నరసింహారెడ్డి పదవీకాలం ముగియనుంది. ఆలోగా ఈభవనాన్ని ప్రారంభించాలన్న ఆలోచనతో గత వారం క్రితమే ప్రభుత్వానికి వర్సిటీ అధికారులు లేఖ రాశారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇప్పటికీ కొన్ని పనులు భవనం లోపల కొనసాగుతుండటంతో ప్రారంభానికి మరి కొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Similar News

News October 3, 2024

HYD: ఒక్క క్లిక్‌తో.. భూ వివరాలు మన చేతుల్లో!

image

HYD, RR, MDCL, నల్గొండ, సంగారెడ్డి, భువనగిరి, సిద్దిపేట జిల్లాలకు HMDA 2031 మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. అయితే మాస్టర్ ప్లాన్ సహా, ఈ 7 జిల్లాల పరిధిలోని భూ వివరాలను ఒక్క క్లిక్‌తో ప్రజలు చూసుకునేందుకు ప్రత్యేక యాప్ రానుంది. ఇందులోనే చెరువుల FTL, బఫర్ జోన్ వివరాలు సైతం ఉంటాయి. భవన అనుమతులకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

News October 3, 2024

HYD: యూనివర్సిటీ ర్యాంకుల FULL REPORT

image

✓HYDలోని ఆర్మీ డెంటల్ కాలేజ్ ఇండియాలో 40వ ర్యాంకు సాధించింది
✓ఉస్మానియా మెడికల్ కాలేజ్ 48వ ర్యాంకు సాధించింది
✓న్యాయవిద్యలో నల్సార్ యూనివర్సిటీకి 3వ ర్యాంకు
✓ఇన్నోవేషన్ విభాగంలో IITH మూడో ర్యాంకు
✓పరిశోధనల్లో IITH 15, HCU 18 ర్యాంకు
✓వ్యవసాయ కళాశాలల్లో జయశంకర్ యూనివర్సిటీ 37వ ర్యాంకు
✓IIIT HYD టాప్ 100 యూనివర్సిటీలో 74వ ర్యాంక్

News October 3, 2024

రాచకొండ కమిషనరేట్ పరిధిలో డీజే వినియోగంపై నిషేధం: సీపీ

image

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మతపరమైన ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్ వినియోగంపై నిషేధం విధిస్తూ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధనలు, ప్రభుత్వ అనుమతులను ఉల్లంఘిస్తే బీఎన్ఎస్ 223, 280, 292, 293, 324, బీఎన్ఎస్ఎస్ 152, పర్యావరణ పరిరక్షణ చట్టం సెక్షన్ 15 కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు.