News April 10, 2024

HYD: ‘గోవాలో పుట్టినరోజు జరుపుకొని వస్తూ డ్రగ్స్ తెచ్చారు’

image

HYD సనత్‌నగర్ బస్టాండ్‌లో నాగరాజ్‌ అనే యువకుడితో పాటు అతడి నలుగురు స్నేహితులను అరెస్ట్ చేశామని SOT రాజేంద్రనగర్ టీం తెలిపింది. వారి నుంచి 4 గ్రాముల MDMA డ్రగ్, 5గ్రాముల గంజాయి, OCB రేపర్స్ స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. విచారణలో ఏప్రిల్ 4న నాగరాజ్‌ స్నేహితుడు దిలీప్ పుట్టినరోజు సందర్భంగా నలుగురు స్నేహితులతో గోవాకు వెళ్లి MDMA డ్రగ్‌తోపాటు GOA నుంచి బస్సులో HYDకు తిరిగి వచ్చారని తేలిందన్నారు.

Similar News

News March 24, 2025

HYD MMTSలో యువతిపై అత్యాచారయత్నం

image

సికింద్రాబాద్ TO మేడ్చల్ MMTS ట్రెయిన్‌లో ఓ యువతిపై దుండగుడు అత్యాచారానికి యత్నించాడు. ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారానికి యత్నించగా.. కదులుతున్న ట్రెయిన్‌లో నుంచి ఆ యువతి దూకేసింది. తీవ్రగాయాలైన ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 24, 2025

HYD: రూ.5లక్షలు కాజేసిన సుడో పోలీసులు

image

HYD: బోయినపల్లిలో సుడో పోలీసు డబ్బులు కాజేశాడు. రాత్రి సమయంలో వాహనం తనిఖీ చేయలంటూ ద్విచక్ర వాహనదారుడిని సూడో పోలీసులు ఆపారు. పోలీస్ డ్రెస్‌లో ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ తనిఖీ చేశారు. వాహణదారుడి దగ్గర రూ. 5లక్షల బ్యాగు ఉండటం చూసి వివరాలు అడిగారు. పోలీస్టేషన్‌కు వచ్చి వివరాలు చెప్పి డబ్బులు తీసుకవెళ్లలంటూ బ్యాగుతో పరారీ అయ్యారు. ఈమేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

News March 24, 2025

నగరంలో విద్యుత్ స్తంభాల లెక్క ఇక పక్కా

image

మహానగరంలో విద్యుత్ స్తంభాలు అసలు ఎన్ని ఉన్నాయో మనకే కాదు విద్యుత్ అధికారులకు కూడా అంతుపట్టదు. ఇక కరెంటు సమస్యలు వచ్చినప్పుడు ఏ పోల్‌లో సమస్య వచ్చిందో కనుగొనడం కష్టమవుతోంది. దీంతో స్తంభాల వివరాలను పక్కాగా లెక్కించనున్నారు. ప్రతి పోల్‌కు ఒక ఐడీ, క్యూఆర్ కోడ్ ఇవ్వనున్నారు. క్యూఆర్ కోడ్‌తో ఆ స్తంభం చరిత్ర మొత్తం తెలిసేలా సాఫ్ట్వేర్ రూపొందించనున్నారు.

error: Content is protected !!