News November 17, 2024
HYD: గ్రూపు-3 పరీక్షలకు అదనపు బస్సులు

ఈ నెల 17, 18 తేదీల్లో జరగనున్న గ్రూప్-3 పరీక్షల కోసం అదనపు బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వినోద్‌కుమార్ తెలిపారు. ఉదయం, సాయంత్రం 2 విడతలుగా జరగనున్న పరీక్షల సమయానికి అనుగుణంగా ఉదయం 10 గంటల్లోపు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకొనేలా బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. పరీక్షల అనంతరం సాయంత్రం తిరిగి గమ్యస్థానాలకు వెళ్లేందుకు వీలుగా బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 17, 2025
సినిమావాళ్ల కంటే మిరే నష్టపోతున్నారు: రాజమౌళి

పోలీసులకు సవాల్ చేసి.. భస్మాసుర హస్తంలా ఇమ్మడి రవి తన తల మీద తానే చెయ్యి పెట్టుకున్నాడని, ఏదీ ఊరికే రాదని దర్శకుడు రాజమౌళి అన్నారు. ఐ బొమ్మలో ఫ్రీగా మూవీలు ఎలా వస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించారా? మీ పర్సనల్ డేటా ఇమ్మడి రవి అమ్ముకుంటున్నాడు. అంత పెద్ద సర్వర్లు మెయింటెన్ చేయాలంటే ఎంతో డబ్బు కావాలి. ఆ డబ్బంతా మీరే ఇస్తున్నారు. మా సినిమా వాళ్లకంటే.. మీరే ఎక్కువగా నష్టపోతున్నారన్నారు.
News November 17, 2025
కాంగ్రెస్ ప్లాన్ B: తప్పించకముందే.. తప్పించుకుంటే!

BRS నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై ఫిరాయింపు వేటు పడకుండా ఉండేందుకు కాంగ్రెస్ పథకం రచిస్తోంది. అనర్హత వేటు పడకముందే రాజీనామా చేయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఎప్పుడు చేయాలనే విషయం సీఎం నిర్ణయిస్తారని సమాచారం. కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం పోటీచేయడంతో ఆయన అధికారికంగా పార్టీ మారినట్లే లెక్కని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.
News November 17, 2025
HYD: ఆ పోస్ట్ అప్పుడే తొలగించాం: సీవీ ఆనంద్

నటుడు బాలకృష్ణపై సీవీ ఆనంద్ పెట్టిన ఓ ఎమోజీ వివాదాస్పదమైంది. దీనిపై బాలయ్య ఫ్యాన్స్ నుంచి విమర్శలు రావడంతో సీవీ ఆనంద్ స్పందించారు. దాదాపు 2 నెలల క్రితం తన సోషల్ మీడియాను నిర్వహించే వ్యక్తి ఆ పోస్ట్ చేశారని చెప్పారు. వెంటనే ఆ పోస్ట్‌ను తొలగించి, బాలకృష్ణకు క్షమాపణలు చెప్పానని స్పష్టంచేశారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని ట్వీట్ చేశారు.


