News December 15, 2024
HYD గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచన

గ్రూప్-2కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. HYDలో 101, రంగారెడ్డి 90, మేడ్చల్ జిల్లాలో 116 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 30 సెంటర్లు ఉన్నాయి. ఇప్పటికే అభ్యర్థులను అధికారులు అప్రమత్తం చేశారు. ‘ఉదయం 10 గంటలకు పరీక్ష మొదలవుతుంది. అరగంట ముందే గేట్లు మూసివేస్తారు. నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించారు. సమయానికి చేరుకోవాలి’ అని సూచించారు. ALL THE BEST
SHARE IT
Similar News
News December 3, 2025
MCA విద్యార్థులకు గమనిక.. పరీక్షలు ఎప్పుడంటే!

ఉస్మానియా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ MCA 3వ సెమిస్టర్ పరీక్షల తేదీని వర్సిటీ అధికారులు ప్రకటించారు. ఈ నెల 4 నుంచి (గురువారం) పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. వీటితోపాటు బ్యాక్ లాగ పరీక్షలు కూడా నిర్వహిస్తామని వర్సిటీ పరీక్షల విభాగం అధిపతి ప్రొ.శశికాంత్ తెలిపారు.పరీక్షలకు సంబంధించి టైం టేబుల్ కోసం ఉస్మానియా వెబ్ సైట్ http://www.oucde.net/ చూడవచ్చు.
News December 3, 2025
గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు

గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద ఏఏ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలనే విషయం ఖరారైంది. సమ్మిట్‌కు హాజరయ్యే అతిథులను అలరించేందుకు వీటిని ఏర్పాటు చేశారు. మొదటి రోజు (సోమవారం) మధ్యాహ్నం పేరిణి నృత్యం, రాత్రి కొమ్ము కోయ డాన్స్, కీరవాణి సంగీత కార్యక్రమం, రెండో రోజు(మంగళవారం) ఉదయం వీణ వాయిద్యం, రాత్రి గ్రాండ్ ఫినాలే, డ్రోన్ షో, గుస్సాడి నృత్యం, ఫ్యూజన్ సంగీతం ఉండనుంది.
News December 3, 2025
గ్లోబల్ సమ్మిట్.. ప్రజాభవన్‌లో వార్ రూమ్

8, 9 తేదీల్లో ప్రభుత్వం పెట్టుబడుల కోసం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. పనులు మరింత వేగవంతం చేసేందుకు, మీట్‌ను సక్సెస్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసింది. బేగంపేటలోని ప్రజాభవన్‌లో ఈ వార్ రూమ్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.


