News July 2, 2024

HYD: గ్రూప్-4 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ

image

HYD తెలంగాణ రాష్ట్ర రిక్రూట్మెంట్ కమిషన్ కార్యాలయంలో గ్రూప్-4 అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ జరిగింది. HYD, RR, MDCL, VKB సహా ఇతర జిల్లాలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కొంత మంది అభ్యర్థులు పూర్తి దరఖాస్తులు తీసుకురాకపోవడంతో, అధికారులు పలు సూచనలు చేసి, వారికి తగిన సమయం కేటాయించారు.

Similar News

News November 19, 2025

నగరంలో 3 స్థానాలకు ఉపఎన్నికలు?

image

పార్టీ ఫిరాయించిన MLAలపై చర్యలు తీసుకోవడంలో స్పీకర్ తీవ్రజాప్యం చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటే HYDలో తర్వలో 3స్థానాలకు ఉపఎన్నికలు వస్తాయనే చర్చ నడుస్తోంది. ఖైరతాబాద్ MLA దానంనాగేందర్, శేరిలింగంపల్లి MLA అరికపూడి గాంధీ, రాజేంద్రనగర్ MLA ప్రకాశ్‌గౌడ్, RRలోని చేవెళ్ల MLA కాలె యాదయ్య పార్టీ ఫిరాయించారని, అక్కడ బైపోల్ అనివార్యమని BRS చెబుతూనే ఉంది.

News November 19, 2025

HYD: రాహుల్ సిప్లిగంజ్ వివాహం.. సీఎంకి ఆహ్వానం

image

రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల ఆగస్టులో తను ప్రేమించిన అమ్మాయి హరిణ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు. వారి వివాహానికి నవంబర్ 27న పెద్దలు ముహూర్తం నిశ్చియించారు. ఈ వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా హాజరు కానున్నట్టు సమాచారం. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ తనకు కాబోయే భార్య హరిణ్యరెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి.. తన వివాహానికి ఆహ్వానించారు.

News November 19, 2025

HYD: సంధ్య కన్వెన్షన్ కూల్చివేతలపై హైకోర్టు సీరియస్

image

సంధ్య కన్వెన్షన్ కూల్చివేతలపై సంధ్య శ్రీధర్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం హైడ్రా తీరుపై సీరియస్ అయింది. కూల్చివేతలకు అనుమతి ఎవరిచ్చారని కోర్టు ప్రశ్నించింది. ‘కోర్టు ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదు’ అని హైడ్రాను నిలదీసింది. ఈ కేసు తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది.