News April 7, 2025

HYD: గ్రేటర్లో కల్తీరాయుళ్లకు ఇక తప్పవు కష్టాలు

image

మహానగరంలోని హోటళ్లలో ఎక్కడ చూసినా కల్తీ ఆహారమే దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సిటీలో అనేక చోట్ల అధికారుల తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది. దీంతో నగరంలో ఆరు ఆహార పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని GHMC నిర్ణయించింది. వీటి ఏర్పాటు కోసం రూ.30 కోట్ల నిధులు (ఒక్కో కేంద్రానికి రూ.6 కోట్లు) కావాలని ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు నివేదికలు పంపారు. నిధులు విడుదలైతే ఫుడ్ టెస్టింగ్ సిటీలో జోరందుకుంటుంది.

Similar News

News October 23, 2025

HYD: ఇద్దరు పిల్లలు మృతి.. తల్లడిల్లిన తల్లి

image

హైదరాబాద్ శివారులోని సాగర్ రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం తమ్మలోనిగూడ గేటు వద్ద ట్రాక్టర్ బైక్‌‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రికి గాయాలు అయ్యాయి. ఇద్దరు పిల్లలు అభిరామ్(9), రామ(5) అక్కడికక్కడే మృతి చెందారు. రక్తపు మడుగులో ఉన్న పిల్లలను చూసి తల్లి కన్నీరుమున్నీరైంది. ఈ దృశ్యం చూసిన స్థానికులు చలించిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

News October 23, 2025

రాజేంద్రనగర్‌‌లోని NIRDPRలో ఉద్యోగాలు

image

రాజేంద్రనగర్‌లోని NIRDPRలో పని అనుభవం ఉన్నవారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు. UG, PG, PHD చేసి, అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. రూ.50 వేల జీతంతో రీసెర్చ్ అసోసియేట్ 8 పోస్టులు, సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ ఒక పోస్టుకు రూ.లక్ష వేతనం ఇవ్వనున్నారు. ఈ 9 ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిక్ కింద భర్తీ చేస్తారు. R.Aకు 50 ఏళ్లు, SPCకి 65 ఏళ్లు మించొద్దు. OCT 29న వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది.
SHARE IT

News October 23, 2025

పోచారం కాల్పులు.. రౌడీషీటర్ ఇబ్రహీం అరెస్ట్

image

పోచారం కాల్పుల ఘటనలో నిందితులు అరెస్ట్ అయ్యారు. CP సుధీర్ బాబు ఆదేశాలతో ప్రత్యేక బృందాలు ప్రధాన నిందితుడు ఇబ్రహీం, మోసిన్, శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నాయి. మరో నిందితుడు హనీఫ్ ఖురేషి పరారీలో ఉన్నాడు. తరచూ తమ వ్యాపారానికి అడ్డొస్తున్నాడని కక్ష పెంచుకున్న ఇబ్రహీం, అతడి స్నేహితులు సోను మర్డర్‌కు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే నిన్న <<18078700>>యంనంపేట్<<>>లోని కిట్టి స్టీల్ వద్ద అతడిపై కాల్పులు జరిపారు.