News August 16, 2024

HYD: గ్రేటర్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఎక్కడ?

image

అలంకరణ కోసం వాడే థర్మోకోల్, క్యాండీ స్టిక్, ఐస్క్రీమ్ స్టిక్, ప్లాస్టిక్ జెండాలు, ప్లాస్టిక్ ఫోర్లు, చెంచాలు, ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాస్లు, ఇయర్ బడ్స్, ప్లాస్టిక్ కవర్లు సహా అనేక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై కేంద్రం 2022 జులైలో నిషేధం ప్రకటించింది. కేంద్ర పర్యావరణశాఖ నోటిఫికేషన్ జారీ చేసి దాదాపు 2 ఏళ్లు గడుస్తున్నా GHMC అధికారులు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

Similar News

News January 21, 2025

రంగారెడ్డి: ప్రజావాణికి 87 ఫిర్యాదులు

image

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 

News January 20, 2025

HYD: AIR PORT రన్ వే కింద నుంచి ఎలివేటెడ్ కారిడార్!

image

ఎయిర్‌పోర్ట్ అథారిటీ పరిమితుల కారణంగా HMDA డబుల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని బేగంపేట అంతర్జాతీయ విమానాశ్రయ రన్ వే కింద నుంచి అండర్ గ్రౌండ్‌లో తాడ్ బండ్, బోయిన్‌పల్లి మధ్యలో దాదాపు 600 మీటర్ల మేర నిర్మించాలని నిర్ణయం తీసుకుందని హైదరాబాద్ మెట్రో ఎండీ NVS రెడ్డి తెలియజేశారు. కంటోన్మెంట్ ఏరియాలో విస్తృతంగా పర్యటించి, మార్గాలను పరిశీలించారు.

News January 20, 2025

GHMC ఆఫీస్‌లో ప్రజావాణి కార్యక్రమం

image

ఖైరతాబాద్‌లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను, వినతులను స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు పరిష్కరించాలని ఆదేశించారు. సకాలంలో సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులను డిప్యూటీ మేయర్ ఆదేశించారు.