News April 19, 2024
HYD: గ్రేటర్‌లో 4,053 మెగావాట్ల విద్యుత్ వినియోగం

గ్రేటర్‌లో గురువారం రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదైంది. గతంలో నమోదైన రికార్డులను బ్రేక్ చేస్తూ.. గురువారం ఏకంగా 4,053 మెగావాట్లు నమోదు కావడం విశేషం. 2023 మే 19న అత్యధికంగా 3,756 మెగావాట్లు నమోదు కాగా.. 2024 ఏప్రిల్ 1న 3,832 మెగావాట్లు నమోదైంది. డిస్కం చరిత్రలో ఈ స్థాయిలో విద్యుత్ వినియోగం జరగడం ఇదే తొలిసారి.
Similar News
News November 27, 2025
RR: ధ్రువపత్రాల కోసం మీ సేవకు పరుగులు

గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కుల, ఆదాయ ధ్రువ పత్రాల కోసం మీసేవ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. పోటీ చేసే అభ్యర్థులకు ధ్రువపత్రాలు తప్పనిసరి కావడంతో వారితో మీసేవ సెంటర్‌లు కిక్కిరిసి పోయాయి. రెండో విడతలో నిర్వహించే ఎన్నికల కోసం ముందస్తుగా పత్రాలు సమకూర్చుకుంటున్నట్లు వారు తెలిపారు. ఎన్నికల పుణ్యమా అంటూ తమకు అదనపు గిరాకీ వస్తుందని ఆమనగల్ సహా పలు సెంటర్‌లలోని నిర్వాహకులు చెబుతున్నారు.
News November 27, 2025
జూబ్లీహిల్స్‌లో GHMC మోడల్ ఫుట్‌పాత్

జూబ్లీహిల్స్‌లో జీహెచ్‌ఎంసీ మోడల్ ఫుట్‌పాత్ ప్రాజెక్టు చేపట్టింది. రీసైకిల్ ప్లాస్టిక్ పేవర్లు, సోలార్ గ్రిడ్, టాక్టైల్ పేవింగ్‌తో పాదచారుల భద్రతను పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఫిల్మ్‌నగర్- బీవీబీ జంక్షన్ మధ్య ఉన్న బీజీ కారిడార్‌లో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించి, పర్యావరణ హితంగా నిర్మించే ఈ ప్రాజెక్టు పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News November 27, 2025
రంగారెడ్డి డీసీసీ ఆలస్యం ఎందుకు ‘అధ్యక్షా’

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక పూర్తయింది. అయితే రంగారెడ్డి జిల్లాకు మాత్రం ఇంతవరకు అధ్యక్షుడిని నియమించలేదు. ఎందుకు అధ్యక్షా? అని ఆ పార్టీ జిల్లా నాయకులు ప్రశ్నిస్తున్నారు. డీసీసీ చీఫ్ పోస్టు కోసం రంగారెడ్డి జిల్లా నుంచి దాదాపు 43 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే స్థానికేతరుడిని నియమిస్తున్నారని తెలియడంతో పలువురు ఏఐసీసీకి ఫిర్యాదు చేయడంతో ఎంపిక వాయిదా పడిందని సమాచారం.


