News March 26, 2025
HYD: గ్రేట్.. చనిపోతూ ఏడుగురిని కాపాడాడు!

తాను చనిపోతూ ఏడుగురికి ప్రాణం పోశాడు ఓ యువకుడు. ఎల్బీనగర్లో నివాసం ఉండే శ్రీ అశ్లేశ్ గురునానక్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. మైగ్రేన్, ఫిట్స్‌తో మార్చి 21 అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సికింద్రాబాద్ కిమ్స్‌కు తరలించగా మార్చి 23న అతడి బ్రెయిన్ డెడ్ అయ్యింది. తల్లిదండ్రులు శివశంకర్, ప్రమీల రాణి కుమారుడి అవయవదానానికి ఒప్పుకున్నారు. దీంతో జీవన్‌దాన్ ద్వారా ఏడుగురి ప్రాణాలు కాపాడారు.
Similar News
News December 4, 2025
సంక్రాంతి నుంచి ప్రభుత్వ హాస్టళ్లల్లో చేపల కూర!

TG: ప్రభుత్వ హాస్టళ్లు, క్రీడా పాఠశాలల్లోని విద్యార్థులకు చేపల కూర వడ్డించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సంక్రాంతి తర్వాత ఈ పథకం అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. మత్స్యశాఖ ఇప్పటికే సుమారు 50 కోట్ల చేపపిల్లలను చెరువుల్లో వదిలింది. చేపల ఉత్పత్తి పెరిగితే విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఇప్పటికే సర్కారు ప్రణాళికలను సిద్ధం చేసింది.
News December 4, 2025
‘శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రాల జాబితా సిద్ధం చేయాలి’

జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రాల జాబితాను వారం రోజుల్లో సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ దేవాదాయ శాఖ ఈఓలను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ బంగ్లాలో సమావేశం సంబంధిత అధికారులతో నిర్వహించారు. ఒక్కొక్క దేవాదాయ శాఖ ఈఓ పరిధిలో ఉన్న పుణ్యక్షేత్రాలు ఎన్ని ఉన్నాయి, వాటి చరిత్ర, పురాతనం నుంచి వస్తున్న జాతర చరిత్రలను సిద్ధం చేసి వారం రోజుల్లో జాబితా అందజేయాలన్నారు.
News December 4, 2025
WGL: బాల కార్మికత్వ నిర్మూలనకు పోలీసుల ప్రత్యేక ప్రచారం

బాల కార్మికత్వ నిర్మూలనకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు ‘సే నో టు చైల్డ్ లేబర్ – ఎస్ టు ఎడ్యుకేషన్’ అనే శీర్షికతో అవగాహన పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న చిన్నారి, చదువుకుంటున్న విద్యార్థుల దృశ్యాలను పోస్టర్లో చూపిస్తూ – ‘పని కాదు, విద్యే పిల్లల హక్కు’ అని పిలుపునిచ్చింది. బాల కార్మికుల సమస్యను గుర్తించి స్పందించాలని కోరింది.


