News January 5, 2025

HYD: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

image

మేడ్చల్ చెక్ పోస్టు వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. TVS వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని అంబులెన్స్ సాయంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతులు ఒకే కుటుంబానికి చెందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 4, 2025

బల్దియా.. బడా హోగయా!

image

ORR సమీపంలోని 20 పట్టణాలు, 7 నగరాలు GHMCలో విలీనమయ్యాయి. DEC 2 నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం తాజాగా గెజిట్ విడుదల చేసింది. దీంతో విస్తీర్ణం, జనసాంద్రత, పరిపాలనా విభాగాల పరంగా GHMC దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించింది. ఈ మేరకు ఆయా మున్సిపాలిటీలు, నగరాల రికార్డులను స్వాధీనం చేసుకునే బాధ్యత డిప్యూటీ కమిషనర్‌లు, జోనల్ కమిషనర్‌లకు అప్పగిస్తూ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

News December 3, 2025

GHMC బోర్డులు పెట్టండి: కమిషనర్

image

GHMCలో 27 పురపాలికల విలీనానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ పత్రంలో GHMC కమిషనర్ కర్ణన్, డిప్యూటీ కమిషనర్లకు పలు బాధ్యతలు అప్పగించారు. GHMC బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాక మినిట్ బుక్ సీజింగ్, ఉద్యోగుల సంఖ్య, ప్రాపర్టీస్ వివరాలు, గత మూడు సంవత్సరాల్లో జారీ చేసిన బిల్డింగ్, లేఅవుట్ పర్మిషన్లు, వర్క్, మెటీరియల్ బిల్స్ డేటా సైతం ప్రిపేర్ చేయాలన్నారు.