News August 30, 2024
HYD: చనిపోతూ.. ఐదుగురికి LIFE ఇచ్చాడు!

చనిపోతూ ఐదుగురికి LIFE ఇచ్చాడు ఓ యువకుడు. MBNR హన్వాడ వాసి చెన్నయ్య(35) ఈ నెల 26న యాక్సిడెంట్లో గాయపడగా HYD ఉస్మానియాలో చేర్చారు. వైద్యం అందించిన డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. తండ్రి గోపాల్, కుటుంబ సభ్యులను ఒప్పించి అతడి కాలేయం, 2 కిడ్నీలు (జీవన్దాన్) సేకరించి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అమర్చారు. దీంతో ఐదుగురి ప్రాణాలు నిలబెట్టాడని జీవన్దాన్ ఇన్ఛార్జ్ స్వర్ణలత తెలిపారు.
Similar News
News October 22, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: ఓపిక లేదని వెళ్లిపోయారు!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులకే చిరాకు వచ్చింది. నిన్న పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అధికారులు టోకెన్లు ఇచ్చారు. బుధవారం తెల్లవారుజాము వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగడంతో టోకెన్లు తీసుకున్న కొందరు అర్ధరాత్రి దాటినా ఇంకా సమయం పడుతుందని తెలిసి, ఇక తమ వల్ల కాదంటూ వెనక్కి వెళ్లిపోయారు. 10 మందికిపైగా అభ్యర్థులు టోకెన్లు తీసుకొని నామినేషన్ వేయనట్లు అధికారులు గుర్తించారు.
News October 22, 2025
మంజీరా నుంచి HYDకి కొత్త పైప్ లైన్

ఆరు దశాబ్దాల కిందటి మంజీరా పైప్లైన్ల నుంచి 20 శాతం నీరు లీకేజీల ద్వారా వృథా అవుతోంది. ఈ నీటి నష్టాన్ని అరికట్టడానికి జలమండలి సిద్ధమైంది. ఈ మేరకు రూ.722 కోట్ల వ్యయంతో కొత్త పైప్లైన్ వేయడానికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వ ఆమోదం రాగానే పనులు ప్రారంభించేందుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది.
News October 22, 2025
చర్లపల్లి – దానాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు

పండుగల రద్దీ దృష్ట్యా చర్లపల్లి, దానాపూర్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. అక్టోబరు 23, 28 తేదీల్లో చర్లపల్లి నుంచి దానాపూర్ (07049), 24, 29 తేదీల్లో దానాపూర్ నుంచి చర్లపల్లి (07092) రైళ్లు నడుస్తాయి. అలాగే, 26న 07049, 27న 07050 నంబరు గల ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు.


