News April 12, 2025
HYD: చర్లపల్లి టెర్మినల్ నుంచి రైళ్ల పరుగులు

సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగించే మరిన్ని రైళ్లు చర్లపల్లి టెర్మినల్ నుంచి నడిపేందుకు రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ వరకు నడిచే పలు దూరప్రాంత రైళ్లు ఇప్పటికే చర్లపల్లి టెర్మినల్కు మళ్లించారు. వేసవి ప్రత్యేక రైళ్లు కూడా చర్లపల్లి నుంచి ప్రయాణిస్తున్నాయి. ఈ నెల 28 నుంచి మరిన్ని రైళ్లు చర్లపల్లి నుంచి ప్రయాణించబోతున్నట్లు అధికారులు ప్రకటించారు.
Similar News
News December 4, 2025
వేయిస్తంభాల గుడా హుండీ ఆదాయం రూ.12,04,168

హనుమకొండ జిల్లాలోని వేయిస్తంభాల ఆలయంలోని హుండీల ఆదాయం లెక్కించారు. 50 రోజుల్లో హుండీలు, పూజా టికెట్లు కలిపి రూ.12,04,168 ఆదాయం వచ్చిందని ఈఓ ధరణికోట అనిల్ కుమార్ తెలిపారు. పర్యవేక్షకుడిగా దేవాదాయశాఖ పరిశీలకుడు ప్రసాద్ వ్యవహరించారు. భక్తుల ఆదరణతో ఆదాయం మెరుగ్గా ఉందన్నారు. ఆలయ అర్చకులు, సిబ్బంది, సేవాసమితి సభ్యులు లెక్కలో పాల్గొన్నారు.
News December 4, 2025
సంక్రాంతి నుంచి ప్రభుత్వ హాస్టళ్లల్లో చేపల కూర!

TG: ప్రభుత్వ హాస్టళ్లు, క్రీడా పాఠశాలల్లోని విద్యార్థులకు చేపల కూర వడ్డించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సంక్రాంతి తర్వాత ఈ పథకం అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. మత్స్యశాఖ ఇప్పటికే సుమారు 50 కోట్ల చేపపిల్లలను చెరువుల్లో వదిలింది. చేపల ఉత్పత్తి పెరిగితే విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఇప్పటికే సర్కారు ప్రణాళికలను సిద్ధం చేసింది.
News December 4, 2025
‘శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రాల జాబితా సిద్ధం చేయాలి’

జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రాల జాబితాను వారం రోజుల్లో సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ దేవాదాయ శాఖ ఈఓలను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ బంగ్లాలో సమావేశం సంబంధిత అధికారులతో నిర్వహించారు. ఒక్కొక్క దేవాదాయ శాఖ ఈఓ పరిధిలో ఉన్న పుణ్యక్షేత్రాలు ఎన్ని ఉన్నాయి, వాటి చరిత్ర, పురాతనం నుంచి వస్తున్న జాతర చరిత్రలను సిద్ధం చేసి వారం రోజుల్లో జాబితా అందజేయాలన్నారు.


