News April 12, 2025

HYD: చర్లపల్లి టెర్మినల్ నుంచి రైళ్ల పరుగులు

image

సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగించే మరిన్ని రైళ్లు చర్లపల్లి టెర్మినల్ నుంచి నడిపేందుకు రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ వరకు నడిచే పలు దూరప్రాంత రైళ్లు ఇప్పటికే చర్లపల్లి టెర్మినల్‌కు మళ్లించారు. వేసవి ప్రత్యేక రైళ్లు కూడా చర్లపల్లి నుంచి ప్రయాణిస్తున్నాయి. ఈ నెల 28 నుంచి మరిన్ని రైళ్లు చర్లపల్లి నుంచి ప్రయాణించబోతున్నట్లు అధికారులు ప్రకటించారు.

Similar News

News April 19, 2025

ఇలా చేస్తే కోటీశ్వరులు కావొచ్చు!

image

పెట్టుబడుల కోసం చాలా మార్గాలున్నా, సిప్(SIP) అనేది దీర్ఘకాలంలో మంచి లాభాలు ఇస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మంచి స్టాక్స్‌ను సెలెక్ట్ చేసుకొని నెలకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి పెట్టగలిగితే 15 ఏళ్లలో కోటి లేదా అంతకుమించి జమ చేసుకోవచ్చని తెలుపుతున్నారు. అయితే, మార్కెట్ల ఒడిదొడుకులు వల్ల స్వల్ప కాలంలో రాబడి ఉండదని, కనీసం పదేళ్లు కొనసాగిస్తామనే వారే SIP స్టార్ట్ చేయడం మంచిదని సూచిస్తున్నారు.

News April 19, 2025

ఆసిఫాబాద్ జిల్లాలో 144 సెక్షన్: SP

image

ఆసిఫాబాద్ జిల్లాలో ఈనెల 20 నుంచి నిర్వహించనున్న ఇంటర్, పదవ తరగతి ఓపెన్ స్కూల్ పరీక్ష కేంద్రాల వద్ద BNSS 163 (144) సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ శ్రీనివాస్ రావు తెలిపారు. ప్రశ్నాపత్రాలను కేంద్రాలకు తరలించే సమయంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఇతరులు ఎవరూ కూడా పరీక్షా కేంద్రాల్లో ఉండరాదని పేర్కొన్నారు. గుర్తింపు పొందిన వారిని తప్ప ఎవరినీ కేంద్రాలకు అనుమతించమన్నారు.

News April 19, 2025

మద్దూరు: సీఎం ఫోటోను అవమానపరిచినందుకు అరెస్ట్..!

image

కోటకొండ గ్రామానికి చెందిన కావలి వెంకటేష్ అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఫోటోలను అవమానకరంగా ఎడిట్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. వాట్సాప్ గ్రూపులలో ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా ఫోటోలను షేర్ చేశాడు. ఈ ఘటనపై రేణివట్ల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి యాసిన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

error: Content is protected !!