News April 4, 2025

HYD: చారిత్రాత్మక కట్టడాలు.. చెత్తతో స్వాగతాలు

image

చారిత్రాత్మక కట్టడాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. అధికారుల అలసత్వం, క్రమశిక్షణ లేని జనం మూలంగా మురికి కూపంలా మారుతున్నాయి. అందుకు నిదర్శనం పాతబస్తీలోని గుల్జార్ హౌజ్ వద్ద ఉన్న వాటర్ ఫౌంటెన్. సందర్శకులను ఎంతగానో అలరించిన నిజాంకాలం నాటి ఫౌంటెన్‌ వద్ద నేడు శుభ్రత కరవైంది. మంచినీటికి బదులు మురికి నీరు దాని నిండా ఖాళీ వాటర్ బాటిల్స్, చెత్త చెదారంతో స్వాగతం పలుకుతున్నాయి.

Similar News

News December 19, 2025

HYD: దక్షిణాసియాలోనే ఎత్తైన భవనం ఎక్కడంటే?

image

‘ఘట్‌కేసర్‌లో దక్షిణాసియాలోనే ఎత్తైన భవనం!’ శీర్షికన Way2Newsలో కథనం వెలువడడంతో జనాల్లో చర్చ హోరెత్తింది. నిర్మాణం ఎక్కడా అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. మేడ్చల్ (D) యమ్నాంపేట్ రైల్వే ఫ్లైఓవర్ సమీపంలో 7ఎకరాల్లో 72 అంతస్తుల టవర్‌తో పాటు 62అంతస్తుల 2భవనాల నిర్మాణానికి ఓ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ‘డాన్సింగ్ డాఫోడిల్స్ థీమ్’తో రూపుదిద్దుకునే ఈ కట్టడం గాలిలో మెలికలు తిరుగుతున్నట్లుగా కనువిందు చేయనుంది.

News December 19, 2025

HYD: ఆస్తి పన్ను చెల్లింపు జీహెచ్ఎంసీ యాప్‌లోనే!

image

శివారు ప్రాంతాల విలీనంతో జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌లో మార్పులు చేసింది. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్సు, తదితర ఫీజులు జీహెచ్ఎంసీ యాప్‌లో చెల్లించేలా కొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇకనుంచి ట్రేడ్ లైసెన్స్, ఆస్తు పన్నులు యాప్‌లో చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం యాప్‌లో ప్రత్యేక విండో ఏర్పాటు చేశారు. అయితే శివారు ప్రాంతాలకు ఎంత బిల్లు చెల్లించాల్సి వస్తుందని వ్యాపారస్థులు, ప్రజలు భయపడుతున్నారు.

News December 19, 2025

HYDలో తగ్గిన ఎయిర్‌ క్వాలిటీ.. జాగ్రత్త!

image

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరుకుంటోంది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ట్రిపుల్ డిజిట్‌లోకి చేరుకుంది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, మల్లాపూర్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
SHARE IT