News May 3, 2024

HYD: చికెన్‌ కర్రీలో పడి BRS కార్యకర్తకు గాయాలు

image

చికెన్‌ కర్రీలో పడి BRS కార్యకర్తకు తీవ్ర గాయాలైన ఘటన ధారూరు మండలంలో చోటుచేసుకుంది. ధారూరులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం భోజనానికి వెళ్లగా.. కుక్కింద గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్త మల్లయ్య.. కార్యకర్తల తోపులాటలో అదుపు తప్పి పక్కనే ఉన్న చికెన్‌ బోగాణలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో మల్లయ్యకు తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.

Similar News

News November 3, 2024

HYD: చికెన్ ఫ్రైలో పురుగుపై కోర్టులో కేసు

image

హైదరాబాద్‌లోని సైబర్ టవర్స్ ఎదురుగా ఉన్న మెహ్ ఫిల్ రెస్టారెంట్లో స్విగ్గి ద్వారా అనిరుద్ అనే వ్యక్తి చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రై, తదితర ఆర్డర్ చేయగా.. చికెన్ ఫ్రైలో పురుగు వచ్చిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీకి ఫిర్యాదు అందించగా, యంత్రాంగం కదిలింది. పూర్తిగా తనిఖీలు చేపట్టిన అధికారులు, అసురక్షిత ఆహార పదార్థాలను గమనించి, టెస్టింగ్ కోసం శాంపిల్స్ సేకరించారు. దీనిపై కోర్టులో కేసు వేస్తామని తెలిపారు.

News November 3, 2024

గ్రేటర్ HYDలో నియోజకవర్గాల సంఖ్య పెరిగే CHANCE?

image

2025-26లో దేశ వ్యాప్తంగా జనగణన జరగనుంది. జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ నియోజకవర్గాల స్థానాలు పెరగనున్నాయి. ఇదే తరుణంలో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 119 స్థానాలు, 153కు చేరే అవకాశం ఉండగా.. గ్రేటర్ HYDలో ప్రస్తుతం ఉన్న 24 నియోజకవర్గాలు కాస్త.. 50కి చేరే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

News November 3, 2024

తెలంగాణకు స్లీపర్ వందే భారత్ తీసుకువస్తాం: కిషన్ రెడ్డి

image

తెలంగాణ రాష్ట్రానికి స్లీపర్ వందే భారత్ రైలును సైతం తీసుకువస్తామని HYDలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. HYD నగరంలో చర్లపల్లి, సికింద్రాబాద్, హైటెక్ సిటీ, బేగంపేట లాంటి అనేక రైల్వే స్టేషన్ల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రైల్వే రంగాన్ని బలోపేతం చేసి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని తెలిపారు.