News April 10, 2025
HYD: చికెన్, మటన్ షాపులు బంద్

గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక. మాంసం దుకాణాలు నేడు బంద్ చేయాలని GHMC ఉత్వర్వులు జారీ చేసింది. కబేళాలు, రిటైల్ బీఫ్ దుకాణాలు మూసి ఉంటాయని ప్రకటించింది. మహావీర్ జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. GHMC లిమిట్స్లోని అన్ని మాంసం దుకాణాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.
SHARE IT
Similar News
News November 18, 2025
‘ఇంటికి రా బిడ్డా’ అని కోరిన తల్లి.. వారానికే హిడ్మా హతం

మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా తల్లిని ఇటీవల ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ కలిశారు. ఈ సందర్భంగా తల్లి భావోద్వేగానికి గురయ్యారు. ‘ఎక్కడున్నావు బిడ్డా.. ఇప్పటికైనా ఇంటికి రా’ అని ఆమె కోరారు. ఇది జరిగిన వారం రోజులకే హిడ్మా హతమయ్యాడు. తాజా ఎన్కౌంటర్లో అతని భార్య కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. ఆమెపై రూ.50లక్షల రివార్డు ఉంది.

వేములవాడలో అదనంగా 30 కళ్యాణం టికెట్లు జారీ

వేములవాడ పుణ్యక్షేత్రంలో శ్రీ పార్వతి, రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. నిత్య ఆర్జిత సేవలలో భాగంగా మంగళవారం ఆలయ అన్నదాన సత్రం పైఅంతస్తులో అర్చకులు, వేద పండితుల మంత్రాల మధ్య స్వామివారి కళ్యాణం కనులపండువగా సాగింది. కళ్యాణం టికెట్ల కోసం భక్తులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో మంగళవారం అదనంగా 30 టికెట్లను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.