News April 10, 2025

HYD: చికెన్, మటన్ షాపులు బంద్

image

గ్రేటర్‌ హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక. మాంసం దుకాణాలు నేడు బంద్ చేయాలని GHMC ఉత్వర్వులు జారీ చేసింది. కబేళాలు, రిటైల్ బీఫ్ దుకాణాలు మూసి ఉంటాయని ప్రకటించింది. మహావీర్ జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. GHMC లిమిట్స్‌లోని అన్ని మాంసం దుకాణాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.
SHARE IT

Similar News

News April 19, 2025

మల్దకల్: గత 20 రోజుల్లో 6గురు మరణం 

image

మల్దకల్ మండలంలోని నేతవానిపల్లిలో గత 20 రోజుల్లో 6గురు మరణించారని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో ఎక్కడ చూసిన చావు కేకలు వినిపిస్తున్నాయన్నారు. ఆరుగురి వరస మరణాలతో గ్రామం ఉలిక్కిపడింది. ఉన్నట్టుండి అకస్మాత్తుగా మరణం సంభవిస్తుందని ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియని పరిస్థితుల్లో బతుకుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించాలని ప్రజలు కోరారు.

News April 19, 2025

ధాన్యం కొనుగోళ్లు సమర్థవంతంగా నిర్వహించాలి: అడిషనల్ కలెక్టర్

image

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ శుక్రవారం సూచించారు. ఈ మేరకు నిజాంపేట మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించి ఆర్ వెంకటాపూర్ గ్రామంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోలు సమర్థవంతంగా వేగవంతంగా జరపాలని, రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు ఆదేశించారు.

News April 19, 2025

ఎల్కతుర్తి సభ చరిత్రలో నిలిచిపోతుంది: ఎమ్మెల్యే పల్లా

image

ఈ నెల 27న ఎల్కతుర్తి సమీపంలో నిర్వహించబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సభా వేదికను నేతలతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. బీఆర్ఎస్ పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేసిందని, కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

error: Content is protected !!