News January 17, 2025

HYD: చిన్నప్పటి నుంచి నుమాయిష్‌కు వచ్చేవాడిని: సీపీ

image

నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయంతో విద్యారంగ వ్యాప్తికి నిర్వాహకులు ఎంతో కృషి చేస్తున్నారని HYD సీపీ సీవీ ఆనంద్ అన్నారు. గురువారం ఇందులో పోలీస్ స్టాల్‌ను ప్రారంభించి మాట్లాడారు. తన చిన్నప్పటి నుంచి నుమాయిష్‌ను సందర్శించి కావాల్సినవి కొనుక్కుని ఉల్లాసంగా గడిపేవాడినని గుర్తుచేసుకున్నారు. ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్, డీసీపీలు,ఏసీపీలు,ఇన్ స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 14, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: మిగిలిన 8 రౌండ్లు కీలకం

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యం కొనసాగుతోంది. మొత్తం రెండు రౌండ్లలో ఆయన ఆధిక్యం 1,144కు చేరింది. రెండో రౌండ్లో నవీన్ యాదవ్‌కు 9691, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8609 ఓట్లు వచ్చాయి. ఇంకా 8 రౌండ్లు మిగిలి ఉండగా.. అభ్యర్థి గెలుపులో కీలకం కానున్నాయి.

News November 14, 2025

జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్.. BRS మరింత అప్రమత్తం!

image

ఈరోజు జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్‌కు BRS అధిష్ఠానం మరింత అప్రమత్తమైంది. పాలకులు తప్పుదారి పట్టిస్తారేమోనని అనుమానం వచ్చి HYD బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌కు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్లను రంగంలోకి దించింది. ఎర్రోళ్ల శ్రీనివాస్, చిరుమర్తి లింగయ్య,క్రాంతి కిరణ్, గండ్ర వెంకట రమణారెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులను కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించి కౌంటింగ్‌లో జరిగే తప్పులను గట్టిగా నిలదీసేలా ప్లాన్ చేసింది. 

News November 14, 2025

జూబ్లీహిల్స్ బై పోల్: అనుమానం వచ్చి ఫిర్యాదు చేస్తేనే VVPAT లెక్కింపు

image

మనం ఓటు వేసినపుడు ఓ స్లిప్ మనం ఎవరికి ఓటు వేశామో మనకు చూపించి ఆ తరువాత ఒక డబ్బాలో పడిపోతుంది. దానినే VVPAT అంటారు. ఆ స్లిప్పులను కౌంటింగ్ సమయంలో లెక్కించరు. అయితే పోలింగ్ శాతానికి, ఓట్లకూ లెక్క సరిపోవాలి. అలా కానిపక్షంలో ఏజెంట్లు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తారు. అప్పుడు ఆర్ఓతోపాటు సూపర్ వైజర్ VVPAT (Voter Verifiable Paper Audit Trail)  ఓట్లను లెక్కిస్తారు.