News December 25, 2024

HYD: చీకటి ప్రాంతాలే అడ్డాగా..!

image

HYD శివారు చీకటి ప్రాంతాలను చైన్ స్నాచింగ్, గంజాయి, అసాంఘిక కార్యక్రమాలకు ముఠాలు అడ్డగా మార్చుకుంటున్నట్లు వివిధ కేసుల్లో తెలిసింది. శామీర్‌పేట, పెద్ద అంబర్ పేట, ఔటర్ రింగ్ రోడ్డు సమీప ప్రాంతాల్లో అన్నోజిగూడ, యమ్నంపేట, ఘట్కేసర్, మాధవరెడ్డి బ్రిడ్జి, అవుషాపూర్, తోండుపల్లి జంక్షన్, మల్లంపేట నుంచి దుండిగల్ వైపు ప్రాంతాల్లో ముఠాలు తిష్ట వేస్తున్నాయి.

Similar News

News October 20, 2025

నగరంలో దీపావళిపై ఆర్టిఫిషియల్ వెలుగులు

image

దీపావళికి మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించే ఆచారం ఇప్పుడు నగరంలో తగ్గుముఖం పడుతోంది. కోఠి, అబిడ్స్, దిల్‌సుఖ్‌నగర్, బాలానగర్, కూకట్‌పల్లి, బేగంబజార్‌లో విక్రయిస్తున్న ఆర్టిఫిషియల్ లైట్లే ఆకర్షిస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. ఆన్‌లైన్‌‌లో లభించే వివిధ ఆకృతుల దీపాలతో ఇళ్లు అలంకరిస్తున్నారు. మట్టి ప్రమిద అజ్ఞానం తొలగించి జ్ఞాన వెలుగు ప్రసరింపజేయాలనే భావనతో వచ్చిన సంప్రదాయంగా పెద్దలు చెబుతున్నారు.

News October 20, 2025

HYD: బాలుడి చేతిలో బ్యాగ్.. అందులో బుల్లెట్

image

ప్రగతినగర్‌లో తల్లితో ఉంటున్న ఓ బాలుడు (12)ఇంట్లో ఉండటం ఇష్టం లేక మూసాపేట మెట్రో స్టేషన్‌కు బ్యాగుతో వచ్చాడు. సిబ్బంది తనిఖీ చేయగా షాక్‌కు గురయ్యారు. అందులో 9MM బుల్లెట్ బయటపడటంతో మెట్రో స్టేషన్ ఇన్‌ఛార్జికి చెప్పారు. కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. గతంలో బాలుడి తాత మిలిటరీలో పనిచేసి బుల్లెట్ ఇంట్లో ఉంచగా తెచ్చుకున్నాడని తేలింది. కేసు నమోదు చేసినట్లు SI గిరీష్ తెలిపారు.

News October 20, 2025

ఖైరతాబాద్‌లో రేపు సాయంత్రం సదరోత్సాహం

image

ఖైరతాబాద్‌లో రేపు సదర్ సందడి ఉంటుంది. సా.7 గంటలకు ఖైరతాబాద్ లైబ్రరీ వద్ద ఈ వేడుక నిర్వహిస్తారు. దీపావళి పండుగ మరుసటి రోజున ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీ అని.. 8 దశాబ్దాలుగా సదర్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మంగళారపు చౌదరి యాదయ్య యాదవ్ తెలిపారు. స్థానికులు వేడుకలకు హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.