News June 18, 2024

HYD: చెత్త డబ్బాలు క్లీన్ చేయట్లేదు..!

image

GHMC పారిశుద్ధ్య విభాగం ఏడాదికోసారి నగరంలోని రోడ్లపై చెత్త డబ్బాలను ఏర్పాటు చేస్తోంది. అందుకు దాదాపు రూ.3కోట్లు వెచ్చిస్తోంది. ఏర్పాటు చేశాక నిర్వహణను అధికారులు గాలికొదిలేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ వద్ద డబ్బాల్లోని చెత్తను ఎవరూ తొలగించలేదు. కొన్నేళ్లుగా ఇలానే వ్యర్థాలను ఉంచారు. GHMC, రాంకీ సంస్థలు నువ్వంటే నువ్వని చెప్పుకొంటూ బాధ్యతను విస్మరిస్తున్నాయి.

Similar News

News December 22, 2025

రాజేంద్రనగర్: ఫుడ్ పాయిజన్ వార్తల్లో వాస్తవం లేదు: గోవర్ధన్

image

రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల, వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరిగిందన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని చీఫ్ వార్డెన్ డాక్టర్ గోవర్ధన్ తెలిపారు. శనివారం బి- హాస్టల్లో, హాస్టల్ డే నిర్వహించారని, అందులో కొంతమంది విద్యార్థులు ఆలస్యంగా తినడంతో అజీర్తి అయిందన్నారు. వారికి చికిత్స అందించారు అంతకుమించి ఎలాంటి ఇబ్బంది లేదని, విద్యార్థులు అందరూ సురక్షితంగా ఉన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మవద్దన్నారు.

News December 22, 2025

HYD: బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. CI క్లారిటీ

image

ప్రేమ వేధింపులు భరించలేక బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు మీర్పేట్ సీఐ శంకర్ నాయక్ తెలిపారు. ఆల్మాస్‌గూడకు చెందిన విహారిక(20), కిషోర్ ప్రేమించుకున్నారు. పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించినప్పటికీ కిషోర్ ప్రవర్తన నచ్చక ఆమె దూరంగా ఉంటుంది. దీంతో కాల్స్, మెసేజ్ చేస్తూ మానసికంగా వేధింపులకు గురిచేశాడని యువతి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

News December 22, 2025

FLASH: HYD: లారీ ఢీకొని SI దుర్మరణం

image

మేడిపల్లి PS పరిధి నారపల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో SI ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల ప్రకారం.. ఉప్పల్ నుంచి అన్నోజిగూడ వైపు బైక్‌పై వెళ్తున్న AR SI రఘుపతి(59)ని నారపల్లి మసీదు సమీపంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.