News April 28, 2024

HYD: ‘చెరువులో దూకి చనిపోతున్నా’

image

చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శామీర్‌పేట పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. వెస్ట్‌ మారేడ్‌పల్లికి చెందిన బత్తుల కుమార్‌(45) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి వెళ్లిన కుమార్‌ తన భార్య మంజులకు ఫోన్‌చేసి తాను బొల్లారం చెరువు వద్ద ఉన్నానని, చెరువులో దూకి చనిపోతున్నానని చెప్పాడు. దీంతో అక్కడ వెతకగా కనిపించలేదు. శామీర్‌పేట చెరువు వద్ద మృతదేహం లభ్యమైంది.

Similar News

News December 10, 2025

ఇండి‘గోల’: ఈ రోజు 77 విమానాలు రద్దు

image

ఇండిగో విమానాల రద్దు పరంపర పర్వం కొనసాగుతూనే ఉంది. శంషాబాద్ విమానాశ్రయంలో ఈ రోజు(బుధవారం) 77 విమానాలు రద్దయ్యాయి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లే 37 ఇండిగోవిమానాలు.. రావాల్సిన 40 విమానాలు రద్దయ్యాయని ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు తెలిపారు. ఈ ప్రయాణికులందరికీ ముందుగానే ‘విమానాల రద్దు’ సమాచారం ఇచ్చామని తెలిపారు.

News December 10, 2025

HYD: CM సాబ్.. జర దేఖోనా!

image

నేడు CM రేవంత్‌ OUకు వస్తున్నారు. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు CM ముందు పలు డిమాండ్లు ప్రస్తవించారు. క్యాంపస్‌కు రూ.1000 కోట్లు, వర్సిటీ భూములను పరిరక్షించాలి, PHD విద్యార్థులకు రూ.20,000, ప్రతి విద్యార్థికి రూ.50,000 ఫెలోషిప్, హాస్టల్‌లోని మెస్‌లలో నాణ్యమైన భోజనం, స్కిల్ సెంటర్ ఏర్పాటు, విద్యార్థి సంఘాలపై నిర్భంధాలు ఎత్తివేయాలి, ఓయూ PSను క్యాంపస్‌ నుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.

News December 10, 2025

నేడు ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి

image

సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆర్ట్స్ కాలేజ్ ముందు ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో ఈ రోజు ఉ.11 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. ఓయూ సమగ్ర అభివృద్ధి కోసం రూ.1,000 కోట్ల నిధుల హామీ నేపథ్యంలో, కొత్త హాస్టల్ భవనం, లా కాలేజ్, 2500 సీట్ల ఆడిటోరియం సహా అనేక నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.