News April 1, 2025

HYD: చెరువుల్లో నీటి, మట్టి నాణ్యత పరీక్షలు

image

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 11 చెరువుల్లో నీటి, మట్టి నాణ్యతను పరీక్షించేందుకు జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. దుర్గం చెరువు, సున్నం చెరువు సహా అనేక చెరువులు ఇందులో ఉన్నాయి. నేషనల్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్ ద్వారా ఈ పరీక్షలు నిర్వహించి చెరువులను చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొంది.

Similar News

News April 22, 2025

నారాయణపేటకు నూతన వైద్యాధికారి 

image

నారాయణపేట జిల్లా నూతన వైద్య శాఖ అధికారిగా డాక్టర్ జయ చంద్రమోహన్‌ను నియమిస్తూ శనివారం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇక్కడ DMHOగా పని చేసిన సౌభాగ్యలక్ష్మిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆధికారులు విచారణ చేసి కార్యదర్శికి నివేదికలు అందించారు. దీంతో ఆమెను హైదరాబాద్ కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News April 22, 2025

ఆసిఫాబాద్ జిల్లాలో యాక్సిడెంట్

image

తిర్యాణి మండలం గిన్నెదరిలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలిను యువకుడు ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 22, 2025

నిర్మల్: GOOD NEWS.. 25న జాబ్ మేళా

image

ఇంటర్ విద్యార్థులకు HCL TechBee సంస్థ సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగ మేళా ఉంటుందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఐఈఓ జాదవ్ పరశురాం సోమవారం తెలిపారు. ఈనెల 25 పట్టణంలోని ఎస్‌ఎస్ కంప్యూటర్ ఆఫ్ టెక్నాలజీ న్యూ బస్టాండ్ వద్ద డ్రైవ్ ఉంటుందన్నారు. ఉదయం 9 గంటలకు ఎంపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూప్ విద్యార్థులు రావాలన్నారు. కనీస ఉత్తీర్ణత శాతం 75గా ఉన్నావారు అర్హులని పేర్కొన్నారు.

error: Content is protected !!