News September 30, 2024
HYD: చెరువుల హద్దులపై HMDAకు హైకోర్టు ఆర్డర్
HMDAలోని 3,532 చెరువులకుగానూ.. 230 చెరువులకు మాత్రమే బఫర్ జోన్, FTL నిర్ధారించారు. 2,525 చెరువులకు హద్దులను ఖరారు చేసింది. కాగా.. మరో 3 నెలల్లో 1,000 చెరువులకు హద్దులను నిర్ధారించాలని హైకోర్టు HMDAను ఆదేశించింది. హైకోర్టు నోటీసుల నేపథ్యంలో HMDA చర్యలకు ఉపక్రమించింది. నవంబర్లోగా పని పూర్తి చేయాల్సి ఉంది.
Similar News
News November 25, 2024
HYDలో పెరిగిన చలి.. జాగ్రత్త!❄
HYD, ఉమ్మడి RR జిల్లాల్లో చలి విపరీతంగా పెరిగింది. గత 3 రోజుల క్రితమే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు చలిగాలులు వీస్తున్నాయి. ఇక అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు మంచు అలుముకుంటోంది. శ్వాసకోస సమస్యలు ఉన్నవారు ఈ సమయాల్లో బయటకురాకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. జాగ్రత్త!
SHARE IT
News November 24, 2024
HYD: ‘బఫర్ జోన్లో హైడ్రా కమిషనర్ ఇల్లు’.. క్లారిటీ
హైడ్రా కమిషనర్ AV రంగనాథ్ ఇల్లు బఫర్ జోన్లో ఉందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ‘మధురానగర్లోని మా ఇల్లు బఫర్ జోన్లో లేదు. కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. 44 ఏళ్ల క్రితం మా నాన్న కట్టించిన ఇంట్లోనే ఉంటున్నాను. 25 ఏళ్ల క్రితం చెరువులో కృష్ణకాంత్ పార్క్ నిర్మించారు. మా ఇంటికి ఒక కిలో మీటర్ దూరంలో ఉంది. మధ్యలో వేలాది ఇండ్లు ఉన్నాయి’ అని స్పష్టం చేశారు.
News November 24, 2024
HYD: మహిళకు SI వేధింపులు..!
HYDలోని ఓ SI వేధిస్తున్నారని గృహిణి సీపీ సుధీర్ బాబుకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ప్రకారం.. ‘నా భర్త వేధింపులు తాళలేక PSలో ఫిర్యాదు చేశాను. అందులోని నా మొబైల్ నంబర్ తీసుకుని SI పర్సనల్ మెసేజులు చేస్తూ వేధిస్తున్నారు’ అని వాపోయారు. ‘నీ కేసు నేను పరిష్కరిస్తా.. మీ ఇంటికి వస్తా’ అంటూ అసభ్యంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు.