News November 25, 2024
HYD: చేపల వంటకాల గూరించి అడిగిన మంత్రి
HYD ట్యాంక్‌బండ్ ఐమ్యాక్స్ పక్కన ఉన్న గ్రౌండ్‌లో ప్రపంచ మత్స్యకార ఉత్సవ ముగింపు ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించిన మంత్రి, చేపల వంటకాల గురించి అడిగి తెలుసుకున్నారు. చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, మత్స్యకారుల సేవలు వెలకట్టలేనివని అభినందించారు.
Similar News
News November 25, 2024
సూరారంకాలనీ: శివుడికి పెరుగన్నంతో అలంకరణ
కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో సూరారం కాలనీ, రామాలయంలోని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివుడికి భక్తులు అన్నాభిషేకం నిర్వహించారు. ఉదయం నుంచి భక్తుల సందడితో ఆలయం కిటకిటలాడాయి. ఇక్కడి శివలింగం అన్నం, పెరుగుతో భక్తులకు దర్శనమిచ్చారు. దీన్నే సాయంత్రం భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.
News November 25, 2024
HYD: కార్మికులుగా మారుతున్న పేదల పిల్లలు
రెక్కాడితేగానీ డొక్కాడనివి నిరుపేదల జీవితాలు. పొట్టకూటి కోసం శ్రమను నమ్ముకుని ఏదో ఓ పని చేస్తుంటారు. అయితే చాలా మంది తమ చదవుకునే పిల్లలను వెంట తీసుకెళ్తూ బాలకార్మికులుగా మార్చడం ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి దృశ్యాలు HYD మహానగరంలో చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇలాంటి పేదల పట్ల సానుకూలంగా స్పందించి ఉన్నత చదువులతో జీవితానికి బాటలు వేస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు.
News November 25, 2024
HYD: టూర్ వెళ్లాలంటే.. లగ్జరీ బస్సు
రాష్ట్ర ప్రభుత్వం 21 సీట్లతో ఉండే ఏసీ లగ్జరీ మినీబస్, 9 సీట్లు నాలుగు బెర్తులు కలిగిన ఏసీ క్యారవాన్ వెహికల్ సేవలను గత ఏడాది కాలంలో అందుబాటులోకి తెచ్చిందని తెలంగాణ టూరిజం అధికారులు తెలిపారు. HYD, RR, MDCL జిల్లాలకు చెందిన ప్రజలు కుటుంబం మొత్తం కలిసి టూర్లకు వెళ్లేందుకు ఈ సేవలు సద్వినియోగం చేసుకోవచ్చని, ఇందుకోసం 9848540371కు కాల్ చేసి సంప్రదించాలని సూచించారు.