News January 10, 2025

HYD: జనవరి 31న పిల్లలకు నుమాయిష్ ఎగ్జిబిషన్ FREE

image

HYDలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ ఘనంగా కొనసాగుతోంది. జనవరి 31న పిల్లలకు ‘స్పెషల్ డే’గా ప్రకటించారు. పిల్లలు ఉచితంగా వెళ్లే అవకాశం కల్పించారు. కాగా, ఇటీవల జనవరి 9న లేడీస్ ‘స్పెషల్ డే’గా నిర్వహించిన సంగతి తెలిసింది. ఈసారి ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 17 వరకు కొనసాగనుంది.

Similar News

News January 22, 2025

HYDలో ఒకే ఒక పోస్ట్.. శాలరీ రూ. 1,25,000

image

జర్నలిజంలో అనుభవం ఉన్నవాళ్లకు ఇదొక గొప్ప అవకాశం. నెలకు రూ. 80 వేల నుంచి రూ. 1,25,000 వేతనం పొందవచ్చు. ఇటీవల ప్రసార భారతి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ బేసిక్ కింద హైదరాబాద్‌లో సీనియర్ కరస్పాండెంట్ ఒక పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిగ్రీ, PG డిప్లొమా, MCJ చేసినవారు అర్హులు. మీడియా రంగంలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. దరఖాస్తు లాస్ట్ డేట్: JAN 31.
LINK: https://prasarbharati.gov.in
SHARE IT

News January 22, 2025

HYD: రైల్వే ట్రాక్‌పై అమ్మాయి తల, మొండెం (UPDATE)

image

జామై ఉస్మానియాలో అమ్మాయి సూసైడ్ కేసులో అసలు విషయం వెలుగుచూసింది. కాచిగూడ రైల్వే పోలీసుల వివరాలు.. సిద్దిపేట జిల్లాకు చెందిన భార్గవి హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ సెకండియర్ చదువుతోంది. తన బాయ్ ఫ్రెండ్‌తో చాట్ చేస్తున్నట్లు అక్కకు తెలియడంతో భయపడింది. తల్లిదండ్రులకు చెబితే ఏమవుతుందోనన్న ఆందోళనతో <<15212047>>రైల్ కింద పడి ఆత్మహత్య<<>> చేసుకుంది. ఉస్మానియా మార్చురీలో బిడ్డను చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

News January 22, 2025

HYD నుంచి బీదర్ వరకు IAF టీం సైకిల్ యాత్ర

image

HYD బేగంపేట నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ వరకు 20 మంది సభ్యులతో కూడిన IAF బృందం సైకిల్ యాత్ర చేసినట్లుగా తెలిపింది. ఇందులో ఇద్దరు మహిళ ఆఫీసర్లు ఉన్నట్లుగా పేర్కొంది. బీదర్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం చేయడం పట్ల త్రివిధ దళాల అధికారులు వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. IAF అధికారుల సైకిల్ యాత్రను పలువురు ప్రశంసిస్తున్నారు.