News January 3, 2025
HYD: జనవరి 8న విద్యుత్ BC ఉద్యోగుల మహాసభ

TG విద్యుత్ సంస్థల్లో BC ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జాతీయ BC సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జనవరి 8న మ.2 గంటలకు HYD ఎర్రమంజిల్‌లో మహాసభ జరగనుంది. రాజ్యసభ MP R.కృష్ణయ్య అధ్యక్షతన జరిగే ఈసభలో BC ఉద్యోగుల పదోన్నతులు, రిజర్వేషన్లు, పాత పెన్షన్ విధానం, అర్హతల ఆధారంగా ఆర్టిజన్లకు పదోన్నతులు వంటి ప్రధాన డిమాండ్లపై తీర్మానాలు జరుగుతాయి. ముఖ్యఅతిథులుగా ఈటల రాజేందర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
Similar News
News December 27, 2025
HYD: ఆశ్చర్యం.. కంటైనర్‌లో వైన్ షాప్

లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రధాన రహదారి పక్కనే కంటైనర్లోనే వైన్ షాప్ ప్రారంభం కావడం చర్చనీయాంశంగా మారింది. గోల్కొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంజూరైన ఓ వైన్ షాప్ రెడీ కాకపోవడంతో దుకాణదారుడు రోడ్డు పక్కనే కంటైనర్ ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు ప్రారంభించాడు. ప్రధాన రహదారిపై ఇలా కంటైనర్‌లో వైన్ షాప్ నడపడం చూసిన స్థానికులు, ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
News December 27, 2025
HYD: వీడియో వైరల్ చేస్తామని అమ్మాయికి బెదిరింపులు..!

వాట్సాప్‌లో అనుమానాస్పద లింక్స్ పంపిస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు దిగుతున్నారని అధికారులు హెచ్చరించారు. ఉప్పల్ పరిధిలో ఓ యువతికి లింక్ పంపి వీడియో కాల్ చేసిన తర్వాత వ్యక్తిగత వీడియోలు వైరల్ చేస్తామని బెదిరించారు. తెలియని లింక్స్, కాల్స్‌కు స్పందించవద్దని, ఓటీపీ, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు. ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు.
News December 27, 2025
గ్రేటర్ HYDలో నీటి కష్టాలు

HYDలో భూగర్భ జలమట్టాలు వేగంగా పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. భూగర్భ జలాల వినియోగం విపరీతంగా పెరగడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉప్పల్‌లో 7.6 మీటర్లు, అమీర్‌పేటలో 10.5, కుత్బుల్లాపూర్‌లో అత్యధికంగా 18.7, దారుల్షిఫా 7.1, టోలిచౌకి 3.8, రాజేంద్రనగర్ 7.6, శంషాబాద్ 4.6, వికారాబాద్ 4.8 మీటర్ల లోతుకు నీటి మట్టాలు చేరుకున్నట్లు వెల్లడించారు.


