News January 3, 2025
HYD: జనవరి 8న విద్యుత్ BC ఉద్యోగుల మహాసభ
TG విద్యుత్ సంస్థల్లో BC ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జాతీయ BC సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జనవరి 8న మ.2 గంటలకు HYD ఎర్రమంజిల్‌లో మహాసభ జరగనుంది. రాజ్యసభ MP R.కృష్ణయ్య అధ్యక్షతన జరిగే ఈసభలో BC ఉద్యోగుల పదోన్నతులు, రిజర్వేషన్లు, పాత పెన్షన్ విధానం, అర్హతల ఆధారంగా ఆర్టిజన్‌లకు పదోన్నతులు వంటి ప్రధాన డిమాండ్లపై తీర్మానాలు జరుగుతాయి. ముఖ్యఅతిథులుగా ఈటల రాజేందర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
Similar News
News January 25, 2025
HYDలో అర్ధరాత్రి రూల్స్ బ్రేక్!
నగరంలో మిడ్‌నైట్ పలువురు వాహనదారులు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ జంప్ చేస్తున్నారు. పంజాగుట్ట, ఖైరతాబాద్, ఐటీ కారిడార్, కూకట్‌పల్లి తదితర ప్రధాన సిగ్నళ్ల వద్ద రాత్రి 11 దాటితే ఓవర్ స్పీడ్‌తో వెళుతున్నారని ఇతర వాహనదారులు వాపోతున్నారు. దీనికితోడు ఆకతాయిలు చేసే స్టంట్‌లతో ఇబ్బంది తలెత్తుతోందన్నారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News January 24, 2025
HYD: కిడ్నీ రాకెట్ కేసులో కీలక అప్టేట్
కిడ్నీ మార్పిడి కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలకానంద ఆసుపత్రి యజమాని డాక్టర్ సుమంత్‌తో పాటు మరొకరు అరెస్ట్ అయ్యారు. అలకనంద హాస్పటల్‌లో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ వ్యవహారం 6నెలలుగా కిడ్నీ ట్రన్స్ ఫ్లాంటేషన్ ఆపరేషన్స్ కొనసాగుతున్నయి. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం సుమంత్, బెంగళూరుకు చెందిన డాక్టర్ నేతృత్వంలో ముఠా ఏర్పడినట్లు పోలీసులు గుర్తించారు. వీరిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
News January 24, 2025
HYD: రూ.50వేలు లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన సీఐ
లంచం డబ్బులు తీసుకుంటూ HYDలోని షాహినాయత్‌గంజ్ సీఐ బాలు చౌహన్ ఏసీబీకి చిక్కాడు. మిస్సింగ్ కేసులో అనుమానితుడిగా ఉన్న ఓ వ్యక్తి పేరును తొలగించేందుకు రూ.1,50,000 లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. డిమాండ్ చేసిన డబ్బులో రూ.50వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని కేసు నమోదు చేశారు. ఆయన కార్యాలయం, ఇంట్లో సోదాలు జరుపుతున్నారు.