News January 3, 2025

HYD: జనవరి 8న విద్యుత్ BC ఉద్యోగుల మహాసభ

image

TG విద్యుత్ సంస్థల్లో BC ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జాతీయ BC సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జనవరి 8న మ.2 గంటలకు HYD‌ ఎర్రమంజిల్‌లో మహాసభ జరగనుంది. రాజ్యసభ MP R.కృష్ణయ్య అధ్యక్షతన జరిగే ఈసభలో BC ఉద్యోగుల పదోన్నతులు, రిజర్వేషన్లు, పాత పెన్షన్ విధానం, అర్హతల ఆధారంగా ఆర్టిజన్‌లకు పదోన్నతులు వంటి ప్రధాన డిమాండ్లపై తీర్మానాలు జరుగుతాయి. ముఖ్యఅతిథులుగా ఈటల రాజేందర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

Similar News

News January 20, 2025

కేజ్రీవాల్‌పై అంబర్‌పేట్ వాసి పోటీ..!

image

HYD అంబర్‌పేట్ వాసి దుగ్గిరాల నాగేశ్వరరావు న్యూఢిల్లీ 40వ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఆయన పోటీ చేస్తున్నారు. ఈ మేరకు జాతీయ జనసేన పార్టీ తరఫున ఆయన నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతిలో విద్యాభ్యాసం చేసిన నాగేశ్వరరావు అంబర్‌పేట్‌లో ఉంటున్నారు. తన పార్టీ గుర్తు గ్రీన్ చిల్లి అని తెలిపారు. ఇటీవల ఆయన వయనాడ్‌లో ప్రియాంకా గాంధీపై పోటీ చేశారు.

News January 20, 2025

HYD స్విమ్మర్ సరికొత్త రికార్డు

image

HYD కాచిగూడకు చెందిన అంతర్జాతీయ స్విమ్మర్ గంధం క్వీని విక్టోరియా ఓపెన్ వాటర్ స్విమ్మింగ్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పారు. డిగ్రీ చదువుతున్న తన కుమారుడు స్టీఫెన్ కుమార్(20)తో కలిసి ఆదివారం అరేబియా సముద్రంలోని మండ్వాజెట్ నుంచి ముంబయిలోని గేట్వే ఆఫ్ ఇండియా వరకు ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చేసి చరిత్ర సృష్టించారు. తల్లీకుమారుడు కలిసి ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చేయడం దేశంలోనే తొలిసారి.

News January 19, 2025

HYD: రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ: కలెక్టర్లు

image

రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను జారీ చేస్తామని పేర్కొన్నారు. ఈనెల 21 నుంచి 24 వరకు వార్డు సమావేశాల్లో దరఖాస్తులను సమర్పించవచ్చని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ అన్నారు. మీ సేవా కేంద్రాలకు వచ్చిన 2,05,019 దరఖాస్తులను పరిశీలిస్తామని, ప్రజా పాలనలో వచ్చిన అభ్యర్థనలను కూడా పరిశీలిస్తామన్నారు.