News April 10, 2025
HYD: జరిమాణాలు విధించేందుకు ప్రత్యేక యాప్: MD

HYDలో మంచినీటిని వృథా చేయడంపై జరిమానా విధించడం కోసం ప్రత్యేక ఆప్ రూపొందించి, ప్రారంభించినట్లుగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. మంచినీటిని బండలు కడగడం, అంతస్తుల క్యూరింగ్ కోసం, ఇతర అవసరాలకు ఉపయోగించ కూడదని సూచించారు. ఈ ప్రత్యేక ఆప్ ఎగ్జిక్యూటివ్ అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు అందుబాటులో ఉంటుందన్నారు.
Similar News
News February 24, 2026
త్వరలో ప్రసూతి, వివాహ కానుకలు: సుభాష్

AP: ఈ-శ్రమ్ పోర్టల్‌లో రాష్ట్రం నుంచి 88.16L మంది కార్మికులు నమోదయ్యారని మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలిలో 18.24L మంది చేరారని తెలిపారు. త్వరలో కార్మికులకు వివాహ కానుక, ప్రసూతి సాయం, మరణ, అంత్యక్రియల సమయంలో ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్మికుల కోసం సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తున్నామని అసెంబ్లీలో పేర్కొన్నారు.
News February 24, 2026
రూ.2,000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు: అనకాపల్లి

అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో 734 గ్రామాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో రూ.2,000 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. మంగళవారం శాసనసభలో మాట్లాడుతూ.. అనకాపల్లి జిల్లాలో నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్న గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న సడక్ రోడ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
News February 24, 2026
బాధితులకు మెరుగైన ట్రీట్‌మెంట్ ఇవ్వండి: సీఎం

AP: శ్రీకాకుళంలో డయేరియా కేసుల కలకలం నేపథ్యంలో CM CBN అధికారులతో సమీక్ష నిర్వహించారు. 32 మంది డయేరియా బారినపడ్డారని, వీరిలో 10 మంది డిశ్చార్జ్ అయినట్లు అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. రోడ్డు రిపేర్ పనుల వల్లే నీరు కలుషితమైనట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు చెప్పారు. ఆసుపత్రిలో ఉన్నవారికి మెరుగైన ట్రీట్‌మెంట్ ఇవ్వాలని CM ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.


