News March 21, 2024
HYD: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం: మంత్రి

HYDలో ఉన్న జర్నలిస్టులకు తప్పకుండా ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. నగరంలో డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ వెబ్సైట్ను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం చాలా నిబద్ధతగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు బొల్లోజు రవితోపాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
Similar News
News October 18, 2025
HYD నుంచి శ్రీశైలానికి గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం

HYD నుంచి శ్రీశైలానికి 147 కిలోమీటర్ల మేర గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం తెలిపింది. రావిర్యాల నుంచి ఆమన్గల్, ఆమన్గల్ నుంచి మన్ననూరు వరకు దీనిని నిర్మించి, అక్కడి నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. ఫ్యూచర్ సిటీలో భాగంగా HMDA నిర్మిస్తోన్న రావిర్యాల-ఆమన్గల్ కొత్త రోడ్డును దీనికి అనుసంధానించనున్నారు.
News October 18, 2025
HYD: నిజాంపేటలో చిట్టీల పేరుతో రూ.150 కోట్లు స్వాహా

చిట్టీల పేరుతో డబ్బులు స్వాహా చేసిన ఘటన HYD నిజాంపేట పరిధిలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. నిజాంపేటలో రేష్మ, అలీ అనే దంపతులు క్లినిక్ నడుపుతున్నారు. దీంతో పాటు చిట్టీలు నిర్వహించేవారు. అయితే సుమారు 100 మంది నుంచి రూ.150 కోట్ల వరకు వసూలు చేసిన రేష్మ దంపతులు పరారయ్యారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు PSను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
News October 17, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఈరోజు 21 నామినేషన్లు

HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఈరోజు 17 మంది 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఐదుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ వేయగా 12 మంది వివిధ రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థుల నామినేషన్ దాఖలయ్యాయి. ఐదు రోజుల్లో ఇప్పటి వరకు మొత్తం 63 నామినేషన్లు వచ్చాయి.