News September 16, 2024
HYD: జానీ మాస్టర్‌పై కేసు.. నార్సింగి PSకు బదిలీ
జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నార్సింగి PSకు బదిలీ చేశారు. HYD సహా పలు నగరాల్లో అవుట్ డోర్ షూటింగ్ చేస్తున్నప్పుడు, నార్సింగిలోని నివాసంలోనూ జానీ మాస్టర్ తనపై అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళ డాన్సర్ (21) ఫిర్యాదు చేసింది. దీంతో రాయదుర్గం పోలీసులు జీరో FIR నమోదు చేసి తదుపరి విచారణకు నార్సింగి పోలీసులకు అప్పగించారు.పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేసినట్లు తెలిపారు.
Similar News
News October 5, 2024
శంషాబాద్: తండ్రిని హత్య చేసిన కొడుకు
రంగారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. శంషాబాద్‌లో తండ్రిని కొడుకు హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రారెడ్డి కాలనీకి చెందిన రాములు తరచూ మద్యం తాగి గొడవ పడేవాడు. ఈ క్రమంలో రాములు తన కూతురు ఇంటి వద్ద గొడవ పడటంతో కోపోద్రిక్తుడైన అతడి కొడుకు శివకుమార్ గొడ్డలితో నరికి హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News October 5, 2024
శేరిలింగంపల్లి: దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
దసరా సందర్భంగా HCU ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు హెచ్‌సీయూ డిపో మేనేజర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక బస్సులను ఈ నెల 12వ వరకు నడుపుతామన్నారు. లింగంపల్లి నుంచి MGBS వరకు, గచ్చిబౌలి నుంచి మహబూబ్ నగర్ వైపు, లింగంపల్లి నుంచి జహీరాబాద్ వైపు బస్సులు ఉంటాయని వివరించారు. వివరాలకు ఫోన్ నంబర్ 7382814235ను సంప్రదించాలని సూచించారు.
News October 5, 2024
HYD: భారత్-బంగ్లా టీ20 మ్యాచ్.. నేడు టికెట్ల విక్రయం ప్రారంభం!
భారత్-బంగ్లా మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈ నెల 12న ఉప్పల్‌లో జరగనుంది. మ్యాచ్ టికెట్లు ఈ రోజు నుంచి విక్రయించనున్నట్లు HCA అధ్యక్షుడు జగన్మోహన్ తెలిపారు. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి పేటీఎంలో టికెట్లను విక్రయించనున్నట్లు చెప్పారు. టికెట్ ప్రారంభ ధర రూ.750 నుంచి రూ.15 వేలు ఉందన్నారు. ఆన్లైన్‌లో బుక్ చేసుకున్న టికెట్లను ఈ నెల 8 నుంచి 12 వరకు జింఖానా స్టేడియంలో రిడంప్షన్ చేసుకోవాలన్నారు.