News January 21, 2025
HYD: జామై ఉస్మానియా ట్రాక్‌పై అమ్మాయి మృతదేహం
సికింద్రాబాద్ జామై ఉస్మానియా రైల్వే ట్రాక్ మీద అమ్మాయి మృతదేహం కలకలం రేపింది. స్థానికుడు రాజు తెలిపిన వివరాలు.. ‘ఉదయం వాకింగ్‌కు వెళ్లగా రైల్వే ట్రాక్ మీద జనాలు గుమిగూడారు. ఏంటని వెళ్లి చూడగా ఓ అమ్మాయి తల, మొండెం వేరుగా పడి ఉంది. పోలీసులు వచ్చి దర్యాప్తు చేపట్టారు. సదరు యువతి ఓయూలో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు తెలిసింది.’ అని రాజు పేర్కొన్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది
Similar News
News January 22, 2025
HYD నుంచి బీదర్ వరకు IAF టీం సైకిల్ యాత్ర
HYD బేగంపేట నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ వరకు 20 మంది సభ్యులతో కూడిన IAF బృందం సైకిల్ యాత్ర చేసినట్లుగా తెలిపింది. ఇందులో ఇద్దరు మహిళ ఆఫీసర్లు ఉన్నట్లుగా పేర్కొంది. బీదర్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం చేయడం పట్ల త్రివిధ దళాల అధికారులు వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. IAF అధికారుల సైకిల్ యాత్రను పలువురు ప్రశంసిస్తున్నారు.
News January 22, 2025
HYD: పజ్జన్నను ఫోన్‌లో పరామర్శించిన కేటీఆర్
డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌కు గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. అయితే విషయాన్ని తెలుసుకున్న BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పద్మారావుగౌడ్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చికిత్స అనంతరం ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని పద్మారావుగౌడ్ కేటీఆర్‌కు తెలిపారు. తగిన విశ్రాంతి తీసుకొని మళ్లీ కార్యక్షేత్రంలోకి రావాలని కేటీఆర్ ఆయనకు సూచించారు.
News January 22, 2025
జనవరి 25న నేషనల్ ఓటర్స్ డే నిర్వహిస్తాం: CEO
జనవరి 25వ తేదీన HYDలో భారీ ఎత్తున నేషనల్ ఓటర్స్ డే నిర్వహిస్తామని తెలంగాణ స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొంటారని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించి ఓటు హక్కుపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎలక్షన్ అధికారులకు సమావేశంలో ఆదేశించారు.