News October 1, 2024
HYD జిల్లాలో TOP ర్యాంకర్ల లిస్ట్ ఇదే

HYD జిల్లాలో DSC ఫలితాల్లో SGT కే.స్వప్న 89.70, SGT(spl) జే. ఉపేంద్ర-82.90, హిందీ పండిట్ ఆర్.మహాలక్ష్మి-79.97, దత్తాత్రేయ మరాఠీ-49.10, వి.సంపత్ కుమార్ తెలుగు-78.50, యాస్మిన్ ఖానం ఉర్దూ-78.37, బి.సంతోష PET-72.50, ఎస్.తులసి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ-82.70, డీ.సాయి దీప్తి ఇంగ్లRష్-79.17, ఆర్.మహాలక్ష్మి హిందీ 71.47, కే.గోపాల్ గణితం-84.87, కే.విద్యాసాగర్ (PE)-66.50 స్కోర్లతో టాపర్లుగా నిలిచారు.
Similar News
News November 19, 2025
నగరంలో 3 స్థానాలకు ఉపఎన్నికలు?

పార్టీ ఫిరాయించిన MLAలపై చర్యలు తీసుకోవడంలో స్పీకర్ తీవ్రజాప్యం చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటే HYDలో తర్వలో 3స్థానాలకు ఉపఎన్నికలు వస్తాయనే చర్చ నడుస్తోంది. ఖైరతాబాద్ MLA దానంనాగేందర్, శేరిలింగంపల్లి MLA అరికపూడి గాంధీ, రాజేంద్రనగర్ MLA ప్రకాశ్‌గౌడ్, RRలోని చేవెళ్ల MLA కాలె యాదయ్య పార్టీ ఫిరాయించారని, అక్కడ బైపోల్ అనివార్యమని BRS చెబుతూనే ఉంది.
News November 19, 2025
సా.4 గంటల వరకు సచివాలయ ఉద్యోగులకు వైద్యశిబిరం

రాష్ట్ర సచివాలయంలో ఈ రోజు ఉద్యోగులకు వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. ఉ.11 గంటలకు ప్రారంభమయ్యే శిబిరం సా.4 గంటల వరకు ఉంటుందన్నారు. నిపుణులైన డాక్టర్లు వైద్య సేవలందిస్తారని.. సచివాలయ ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య స్పృహ కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
News November 19, 2025
HYD: రాహుల్ సిప్లిగంజ్ వివాహం.. సీఎంకి ఆహ్వానం

రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల ఆగస్టులో తను ప్రేమించిన అమ్మాయి హరిణ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు. వారి వివాహానికి నవంబర్ 27న పెద్దలు ముహూర్తం నిశ్చియించారు. ఈ వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా హాజరు కానున్నట్టు సమాచారం. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ తనకు కాబోయే భార్య హరిణ్యరెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి.. తన వివాహానికి ఆహ్వానించారు.


