News March 21, 2024
HYD: జీరో బిల్లు రానివారికి ప్రత్యేక కౌంటర్లు

అన్ని అర్హతలు ఉండీ గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లు రానివారి కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని, ఆహారభద్రత వివరాలు తప్పుగా నమోదు వంటి కారణాల వల్ల అనేకమంది జీరో బిల్లుకు దూరమయ్యారు. ఇలాంటి వారు తమ వివరాలు సరిచేసుకునేందుకు మండల పరిషత్తు, మున్సిపల్, GHMC సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది.
Similar News
News March 14, 2026
RR: టెన్త్ ఎగ్జామ్స్ రాయనున్న 53,058 మంది

నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 255 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 53,058 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు ఏప్రిల్ 16వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యార్థులు ఎటువంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షలను బాగా రాయాలని ఉపాధ్యాయులు సూచించారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన అని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
News March 13, 2026
RR: ‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం.. 53,058 విద్యార్థులు

పదో తరగతి వార్షిక పరీక్షలు ఈనెల 14వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షలు శనివారం ప్రారంభమై.. ఏప్రిల్ 16వ తేదీ వరకు జరుగుతాయి. పరీక్షల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 255 సెంటర్లు 1,024 పాఠశాలల నుంచి 53,058 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. మాస్ కాపీకి పాల్పడకుండా సెట్టింగ్ స్క్వాయిడ్, ప్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు.
News March 13, 2026
RR: సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయి: కలెక్టర్

రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని, రంగారెడ్డి జిల్లాలో LPG గ్యాస్ కొరత లేదని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. ఇంతకు ముందు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సరఫరా ఉన్నట్లే ప్రస్తుతం కూడా అదే విధంగా గ్యాస్ సరఫరా ఉంటుందని, ఎలాంటి జాప్యం ఉండదన్నారు. జిల్లాలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, గృహ అవసరాలకు వినియోగించే LPG గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదన్నారు.


