News June 24, 2024
HYD: జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ బదిలీ

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్‌ను ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆయన స్థానంలో గత 2 వారాలుగా GHMCకి ఇన్‌ఛార్జి కమిషనర్‌గా వ్యవహరించిన ఆమ్రపాలిని నూతన కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రోనాల్డ్ రాస్‌ను విద్యుత్ శాఖ సెక్రటరీగా నియమించారు.
SHARE IT
Similar News
News November 6, 2025
‘అప్పుడే సింగూరును ఖాళీ చేస్తాం’

నగరానికి తాగునీటిని అందించే సింగూరు ప్రాజెక్టు మరమ్మతు పనుల కోసం అందులోని నీటిని ఖాళీ చేయాలని నిపుణులు నిర్ణయించారు. అయితే ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తరువాతే డ్యామ్‌లో నీటిని ఖాళీ చేస్తామని ఈఈ జైభీమ్ తెలిపారు. ఇదిలా ఉండగా ప్రాజెక్టు రిపేరుకు సంబధించి అధికారులు పలువురు ఎక్స్ పర్ట్స్ సలహాలు తీసుకోనున్నారు. ఐఐటీ హైదరాబాద్ ఇంజినీరింగ్ నిపుణులతో పరిశీలింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
News November 6, 2025
బీఆర్ఎస్ పోరాటం.. కాంగ్రెస్ ఆరాటం.. బీజేపీ ప్రయత్నం

జూబ్లీహిల్స్ బై పోల్స్‌లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపుకోసం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయి. ఎలాగైనా గెలిచి తమ సీటు నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పోరాటమే చేస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేబినెట్ మంత్రులందరికీ ప్రచారంలోకి దించి గెలవాలని ఆరాటపడుతోంది. వీరికితోడు బీజేపీ కూడా గెలుపుకోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. మరి కృషి ఎవరి ఫలిస్తుందో 14 వరకు ఆగాల్సిందే.
News November 6, 2025
సిటీలో సజ్జనార్ మార్క్ పోలీసింగ్ షురూ

హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ మార్క్ పోలీసింగ్ మొదలైంది. ఎక్కడ.. ఎవరు నిర్లక్ష్యం వహించినా సహించబోనని పోలీసు అధికారులనుద్దేశించి పేర్కొన్నారు. ‘‘కొన్ని పాత కేసుల విచారణలో నిర్లక్ష్యం వహించారు.. వాటిపై దృష్టి సారిస్తా. ముఖ్యంగా ఇన్ స్పెక్టర్లు తమ స్టేషన్ కు ఎక్కడో దూరంగా నివాసముంటే కుదరదు.. 15 కిలో పరిధిలోనే ఉండాలి’’ అని పేర్కొన్నారు. సమర్థవంతంగా పనిచేయాలని సమీక్షా సమావేశంలో సూచించారు.


