News March 29, 2025

HYD: జీహెచ్ఎంసీ కొత్త యాప్.. ఆన్ లైన్ చలాన్ !

image

హైదరాబాద్ నగర పరిశుభ్రతను మెరుగు పరిచేందుకు జీహెచ్ఎంసీ త్వరలో కొత్త యాప్‌ను ప్రారంభించనుంది. ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ రూపొందించిన ఈ యాప్ ద్వారా చెత్త నిర్వాహణ మరింత సమర్థంగా మారనుంది. ఎక్కడ పడితే అక్కడ చెత్త, నిర్మాణ వ్యర్థాలు వేయడాన్ని నివారించేందుకు ఈ-చలాన్లు జారీ చేస్తారు. చలాన్ల చెల్లింపులు యూపీఐ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. దీంతో లావాదేవీలు పారదర్శకంగా ఉంటాయి.

Similar News

News October 17, 2025

పాడేరు: మీకోసం కార్యక్రమానికి 186 ఫిర్యాదులు

image

పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ, మీకోసం కార్యక్రమానికి 186 ఫిర్యాదులు అందాయి. ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, డీఆర్వో కే.పద్మలత వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. మీకోసంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను వారు ఆదేశించారు.

News October 17, 2025

త్వరలో 10 గ్రాముల బంగారం ధర రూ.2లక్షలు: నిపుణులు

image

రోజురోజుకూ బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఇదిలాగే కొనసాగితే 2030 నాటికి పది గ్రాముల బంగారం ధర రూ.2 లక్షలకు చేరుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇవాళ కూడా 24 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.3,330 పెరిగి ₹1,32,770కు చేరిన విషయం తెలిసిందే. అమెరికా కరెన్సీ అప్పులు పెరగడం, గ్లోబల్ అస్థిరత కారణంగా ధరలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. 2027లోనే ఇది సాధ్యం కావొచ్చని మరికొందరంటున్నారు. మీరేమంటారు?

News October 17, 2025

రైల్వేలో 8,850 పోస్టులు.. 4 రోజుల్లో దరఖాస్తులు

image

రైల్వేలో మరో భారీ నియామకానికి రంగం సిద్ధమైంది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీల్లో గ్రాడ్యుయేట్ స్థాయిలో 5,800, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో 3,050 పోస్టులున్నాయి.(పోస్టుల సంఖ్యలో మార్పులు ఉండొచ్చు). ఇంటర్, డిగ్రీ పాసైనవారు అర్హులు. గ్రాడ్యుయేట్‌ పోస్టులకు ఈనెల 21 నుంచి NOV 20వరకు, UG పోస్టులకు ఈనెల 28 నుంచి NOV 27వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://indianrailways.gov.in/