News April 7, 2024

HYD: జేబు దొంగల్లా కాంగ్రెస్‌ దుర్మార్గపు పాలన: MLA 

image

ఆరు గ్యారంటీల పేరిట కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి విమర్శించారు. HYD తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వేదికగా కాంగ్రెస్‌ నేతలు మరో మోసానికి తెరలేపారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నీటి మూటలని తేలిపోయిందన్నారు. మంత్రులకు ఐపీఎల్‌ చూడటానికి ఉన్న ప్రాధాన్యం.. రైతులపై లేదని అన్నారు. జేబు దొంగల్లా కాంగ్రెస్‌ దుర్మార్గపు పాలన ఉందన్నారు. 

Similar News

News October 17, 2025

JNTUH విద్యార్థులకు ALERT

image

కూకట్‌పల్లిలోని JNTU 14వ స్నాతకోత్సవానికి సిద్ధమవుతోంది. డిసెంబర్‌లో స్నాతకోత్సవాన్ని నిర్వహించేందుకు యూనివర్సిటీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 2024- 25 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి UG, PG, PHD పూర్తైన విద్యార్థులు డిగ్రీల కోసం నవంబర్ 30లోపు వర్సిటీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు సూచించారు.

News October 17, 2025

నాంపల్లి: నుమాయిష్.. సరికొత్త జోష్

image

హైదరాబాద్ అంటే నుమాయిష్ గుర్తుకొస్తుంది. 84 ఏళ్లుగా నగరవాసులను అలరిస్తున్న నుమాయిష్‌ను వచ్చే ఏడాది వినూత్నంగా నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఎలా నిర్వహించాలనే విషయంపై మేధావులు, నిపుణుల సలహాలు కూడా స్వీకరిస్తున్నామని ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీ రాజేశ్వర్ తెలిపారు. 32 కమిటీలు ఏర్పాటు చేసి నగర ఖ్యాతి పెంచేలా ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తామని వివరించారు.

News October 17, 2025

ఇలా అయితే.. సిటీ మూసీలోకే: రఘునందన్‌రావు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో విజయం సాధించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని పేర్కొన్నారు. కన్నీళ్లతో ఒకరు ప్రచారానికి వస్తే.. కట్టెలు తీసుకొని ఇంకొకరు వస్తున్నారన్నారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరు వచ్చినా సిటీ మూసీలో కలవాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు.