News February 25, 2025
HYD: జేసీపీగా బాధ్యతలు స్వీకరించిన జోయల్

HYD నగర ట్రాఫిక్ విభాగం సంయుక్త పోలీస్ కమిషనర్‌గా జోయల్ డేవిస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సైబరాబాద్ ట్రాఫిక్ చీఫ్‌గా పనిచేశారు. ఆయన కొన్నేళ్లుగా నగర ట్రాఫిక్‌కు ఐజీ ర్యాంకులో ఉండే అధికారిగా అదనపు సీపీ హోదాలో బాధ్యతలు వహిస్తుండగా.. ప్రస్తుతం డీఐజీ ర్యాంకులో ఉండటంతో ఆయనను సంయుక్త పోలీస్ కమిషనర్‌గా నియమించారు.
Similar News
News February 25, 2025
సిద్దిపేట: మహిళా కానిస్టేబుల్ సూసైడ్

సిద్దిపేట జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుల్ యాదాద్రి జిల్లాలో బలవన్మరణానికి పాల్పడింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరూకొలు గ్రామానికి చెందిన అనూష(26) భువనగిరిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ భువనగిరిలో నివాసం ఉంటున్నారు. తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

స్టీల్ ప్లాంట్ విషయంలో చేతులు జోడించి ప్రయత్నించాం: Dy.CM

ఏపీ ప్రజలకు ఒక్క విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనే ఆంధ్రులు అనే భావన వస్తుందని Dy.CM పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అన్నారు. 2021 జనవరిలో విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం చేసిన ప్రకటనకు YCP మద్ధతు పలికిందని అన్నారు. అప్పట్లో నాదేండ్లతో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆ నిర్ణయంపై పునరాలోచించాలని చేతులు జోడించి ప్రయత్నించామన్నారు. స్టీల్ ప్లాంట్‌ను ప్లాట్లు వేసి అమ్ముకోడానికి YCP నాయకులు చూశారని ఆరోపించారు.