News February 25, 2025
HYD: జేసీపీగా బాధ్యతలు స్వీకరించిన జోయల్

HYD నగర ట్రాఫిక్ విభాగం సంయుక్త పోలీస్ కమిషనర్‌గా జోయల్ డేవిస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సైబరాబాద్ ట్రాఫిక్ చీఫ్‌గా పనిచేశారు. ఆయన కొన్నేళ్లుగా నగర ట్రాఫిక్‌కు ఐజీ ర్యాంకులో ఉండే అధికారిగా అదనపు సీపీ హోదాలో బాధ్యతలు వహిస్తుండగా.. ప్రస్తుతం డీఐజీ ర్యాంకులో ఉండటంతో ఆయనను సంయుక్త పోలీస్ కమిషనర్‌గా నియమించారు.
Similar News
News July 8, 2025
లండన్‌లో అడుగుపెట్టిన టీమ్ ఇండియా

ఇంగ్లండ్‌తో జరగబోయే మూడో టెస్టు కోసం టీమ్ ఇండియా లండన్ చేరుకుంది. హీత్రూ ఎయిర్‌పోర్టులో భారత ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి ఆటగాళ్లు నేరుగా హోటల్‌కు వెళ్లినట్లు సమాచారం. కాగా ఎల్లుండి (ఈ నెల 10న) ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. భారత్, ఇంగ్లండ్ జట్లు 5 టెస్టుల సిరీస్‌లో 1-1తో సమంగా కొనసాగుతున్నాయి.
News July 8, 2025
మల్టీపర్పస్ వర్కర్ల జీతాలకు నిధులు విడుదల

TG: గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మూడు నెలల పెండింగ్ జీతాలు రూ.150 కోట్లు ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఇవాళ గ్రామ పంచాయతీల ఖాతాల్లో ఈ నిధుల జమ కానుండగా, ఒకట్రెండు రోజుల్లో 53 వేల మంది మల్టీ పర్పస్ వర్కర్లు తమ జీతాలు అందుకోనున్నారు.
News July 8, 2025
JGTL: ‘90% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి’

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. GOVT. ఆసుపత్రులలో డెలివరీలను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 3నెలల్లో ప్రభుత్వాసుపత్రులలో డెలివరీల సంఖ్య తక్కువగా ఉందని, సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు. వచ్చే 3నెలల్లో 90% డెలివరీలు ప్రభుత్వాసుపత్రిల్లోనే జరిగేటట్లు చూడాలన్నారు. DMHO పాల్గొన్నారు.