News April 7, 2025
HYD: జోరుగా LRS ప్రక్రియ.. రూ.152 కోట్లు

HMDA పరిధిలో LRS ప్రక్రియ జోరందుకుంది. ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తు ఫీజు చెల్లింపు ప్రక్రియ అందుబాటులో ఉండగా, ఇప్పటికే 45వేలకుపైగా LRS అప్లికేషన్లకు దరఖాస్తుల ఫీజు చెల్లింపు ప్రక్రియ పూర్తైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు రూ.152 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రజలందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News November 26, 2025
సమాచార హక్కు చట్టం పారదర్శకంగా అమలు చేయాలి: ఆర్టీఐ కమిషనర్

సమాచార హక్కు చట్టం పారదర్శకంగా అమలు కావాలని ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి అధికారులను సూచించారు. బుధవారం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి, అధికారులు భయపడకుండా ప్రజలకు సమాచారం అందించాలన్నారు. అన్ని శాఖల్లో రిజిస్టర్ నిర్వహణ చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి సూచించారు.
News November 26, 2025
0-5 ఏళ్ల చిన్నారులకు ఆధార్ తప్పనిసరి: కలెక్టర్ జితేష్ వి.పాటిల్

జిల్లాలో 0-5 సంవత్సరాలలోపు వయసు గల పిల్లలందరికీ ఆధార్ నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. బుధవారం ఐడీఓసీలో ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ, రెవెన్యూ శాఖల అధికారులకు ఆయన ఈ విషయాన్ని సూచించారు.
News November 26, 2025
NRPT: ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: ఈసీ

గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ డాక్టర్ వినీత్ పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని, జిల్లాలో నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కమిషనర్ సూచించారు.


